India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం నగరానికి చెందిన మసప్పగారి సంజనరెడ్డి బుధవారం విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచింది. సంజనరెడ్డి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలలో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు ఎం.మధుసూదన్ రెడ్డి, పి.ప్రార్థన రెడ్డిలు నగరంలోని నీరుగంటి వీధిలో నివాసం ఉంటూ వృత్తిరీత్యా ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్నారు.
జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాకుండా పోలీసులు వాహనాలతో అడ్డుకున్నారు. సత్యసాయి బాబా ఆరాధన సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో నారాయణ సేవ జరగుతుంది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి నామినేషన్ వేస్తుండగా వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పుట్టపర్తి పట్టణంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా రాకుండా పోలీసులు తమ వాహనాలను అడ్డుపెట్టారు.
మేలో జరిగే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు బుధవారం తుది గడువు అని అనంతపురం జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, డిఈఓ వెంకటరమణ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని సంబంధిత జూనియర్ కళాశాలలో ఫీజు చెల్లించాలని సూచించారు. ఫీజు మొత్తాన్ని ఆన్లైన్‌లో మాత్రమే చెల్లించాలని స్పష్టం చేశారు.
హిందూపురం నియోజకవర్గ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,46,002 మంది కాగా వీరిలో పురుష ఓటర్లు 1,23,752, మహిళలు 1,22,232, ఇతరులు 18మంది ఉన్నారు. హిందూపురం పట్టణంలో 1,26,488మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ ఓటర్లు 1,19,514 మంది ఉన్నారు. హిందూపురంలో గెలుపునకు పట్టణ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు.
ధర్మవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో సినీనటుడు, బీజేపీ నాయకుడు సాయికుమార్ పాల్గొన్నారు. నేడు సత్యకుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్ శివాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కూటమి పార్టీల కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుంచి 27 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి 8 మంది, పుట్టపర్తి నుంచి ఐదుగురు, మడకశిర నుంచి ఐదుగురు, హిందూపురం నుంచి నలుగురు, ధర్మవరం నుంచి ముగ్గురు, కదిరి నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేశారన్నారు.
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం లేపాక్షి మండలం కల్లూరు, నాయనపల్లి, కొండూరు పంచాయతీల్లో ప్రచారం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బీకే పార్థసారథిని గెలిపించాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించాలని అభ్యర్థించారు. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. ఓటు అనే వజ్రాయుధంతో సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు బాలయ్య పిలుపునిచ్చారు.
హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం హిందూపురం తహశీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అభిషేక్ కుమార్‌కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. హిందూపురం శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు.
రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
విద్యార్హత :MA,
కేసులు :15,
చరాస్తులు: రూ.10.33 లక్షలు,
బంగారం: 90 గ్రాములు,
స్థిరాస్తులు: రూ. 5.45 కోట్లు,
అప్పులు: 1.02 కోట్లు ఉన్నట్లు నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో వారు పేర్కొన్నారు.
ధర్మవరం మండలం కుణుతూరు గ్రామానికి చెందిన S.దీక్షిత పోతుకుంటలో గల పాఠశాలలో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 594 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్‌లో 100కి 100 మార్కులు సాధించారు. దీక్షిత తండ్రి నరసింహులు పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఈ విద్యార్థిని ప్రతిభ పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.