India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పుట్లూరు మండలంలో యాసిడ్ తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని సంజీవపురం గ్రామానికి చెందిన ఉమ్మడి ముఖేశ్ కుమార్ రెడ్డి మూడు ఏళ్లుగా అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టపోయి ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆదివారం బాత్ రూమ్ క్లీన్ చేసే యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కళ్యాణదుర్గం మండలం మంగళకుంటకు చెందిన కురుబ నాగరాజు(34) తన వ్యవసాయ పొలంలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య, పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడు నాగరాజుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని అనంతపురం ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి పికెట్లు ఏర్పాటు చేసి మొబైల్ పార్టీలు తిప్పుతున్నామన్నారు. ముఖ్యమైన గ్రామాల్లో ఏపీఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపామని చెప్పారు. ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా FIR నమోదు చేస్తున్నామన్నారు. నాన్ కాగ్నిజబుల్ నేరమైనా కోర్టు అనుమతితో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
రొళ్ల మండలం పిల్లిగుండ్లపల్లి గ్రామానికి తేజేశ్వర్ రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటల మధ్యలో మెడికల్ కాలేజీలోని రీడింగ్ రూమ్‌లో చదువుకొని హాస్టల్‌కి బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్ రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి మృతి చెందాడు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం వల్ల మంత్రి పదవులు కేటాయించడం కష్టంగా మారింది. కాగా జిల్లాలో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్, బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి వరిస్తాయో వేచి చూడాలి.
వజ్రకరూర్ మండలం వెంకటంపల్లి చిన్న తాండలో శనివారం రాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వజ్రకరూర్ నుంచి గ్రామానికి బైక్ పై వెళుతున్న తులసి నాయక్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. అనంతరం గ్రామంలో ఇరుపార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోగా.. ఇరుపార్టీల వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద టిప్పర్ ఢీకొని ఓపెన్ ఎయిర్ జైలు శిక్ష అనుభవిస్తున్న ఈరన్న (50) అనే ఖైదీ మృతి చెందాడు. శనివారం రాత్రి ఖైదీ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
అనంత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు మినహా ఇతర అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇందులో జాతీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసిన 134 మంది అభ్యర్థుల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు 18 మంది పోగా మిగిలిన 116 మంది అభ్యర్థులు డిపాజిట్ దక్కించుకునేందుకు సరిపడా ఓట్లను సాధించలేక పోయారు.
అనంతపురంలోని కోర్టు రోడ్ లో ఉన్న గుల్జార్ పేట్ ప్రాంతంలో ఫాగింగ్ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నగరంలో మురుగు నీరు నిల్వ ఉన్న చోట్ల బ్లీచింగ్ వేయాలని సూచించారు.
అనంత నియోజకవర్గ అభివృద్ధికి ఆయా శాఖల అధికారులు సహకారం అందించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నగరపాలక సంస్థ పరిధిలోని అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో వరద నిర్వహణలో భారీ వర్షం వచ్చి ఎక్కువ నీరు వస్తే ఎక్కడ నుంచి ఎక్కడికి పోతుంది, ఎక్కడ ప్రభావితం అవుతుంది అనే దానిపై వచ్చే 72 గంటల్లోగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.