India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో జిల్లాకు ఒకటి లేదా రెండు కంటే మించి మంత్రి పదవులు దక్కకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. జిల్లాలో మంత్రి పదవి ఎవరికి వస్తుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
రామగిరి మండలంలోని సుద్దకుంటపల్లి తండాలో వేట కొడవళ్లు పట్టుకొని వీరంగం సృష్టిస్తున్నారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాల తర్వాత కొందరు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు తప్ప ఎవరిని భయభ్రాంతులకు గురి చేయలేదన్నారు. సంబరాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టేమన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలంలో అదుపుతప్పి పోలీసులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. సోమందేపల్లి మండల పరిధిలోని పూలే కమ్మ గుడి వద్ద పెనుకొండ డిఎస్పీ బాబిజాన్ సైదా, కానిస్టేబుళ్లు సోమందేపల్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలైన వారిని చికిత్స నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మండుతున్న కూరగాయల ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి తీవ్రత, సాగునీటి కొరత, తెగుళ్లు, గిట్టుబాటు ధర లేకపోవడం తదితర కారణాలతో కూరగాయల సాగుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా వీటి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. టమాటా, పచ్చి మిరపకాయల ధర కొండెక్కాయి. టోకు మార్కెట్లో (పాతూరు మార్కెట్) కిలో టమాటా ధర రూ.50, పచ్చి మిరపకాయలు కిలో రూ.100 పలుకుతుంది.
పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట గ్రామంలో అశ్విని అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్సై అమానుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. రామాంజినేయులు కుమార్తె అశ్విని ఇంటర్ మీడియట్ చదువు మధ్యలో ఆపేసింది. చదువుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్మ చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం JNTU ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్ మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు(ఎంఓఓసీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కేశవ రెడ్డి, సీఈ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మే నెలలో తృతీయ సంవత్సరం 2వ సెమిస్టర్, నాల్గవ సంవత్సరం 1వ సెమిస్టర్ (ఆర్20) ఎంఓఓసీ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించారు. ఫలితాల కోసం www.jntua.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు 41,659 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మెుదటి రౌండ్ నుంచి 22 రౌండ్ వరకు టీడీపీనే ఆధిక్యంలో కొనసాగింది. కాగా రాయదుర్గం పట్టణంలో టీడీపీకి 16,200 ఓట్ల అత్యధిక మెజార్టీ వచ్చింది. అంతేకాకుండా వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి స్వగ్రమామైన బొమ్మనహాల్ మండలం ఉంతకల్లు గ్రామంలో మెుదటిసారి టీడీపీకి 337 ఓట్ల మెజారిటీ వచ్చింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. శింగనమల నుంచి బండారు శ్రావణి శ్రీ, పెనుకొండ నుంచి సవిత, పుట్టపర్తి నుంచి పల్లె సింధూరరెడ్డి, రాప్తాడు పరిటాల సునీత గెలుపొందారు. కాగా వీరిలో పరిటాల సునీత మినహా మిగిలిన ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం ఇదే మెదటిసారి కావడం గమనర్హం. వారిలో పల్లె సింధూరరెడ్డి, సవిత మెుదటిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు.
తుంగభద్ర నీటి పంపకంపై ఆంధ్ర-కర్ణాటక ఇంజినీర్లు సమావేశాన్ని నిర్వహించారు. తుంగభద్ర జలాశయం పరిధిలో ఉన్న వివిధ కాలువలకు నీటి పంపకంపై అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా ఎస్సీఈ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు ఎక్కువ కురుస్తున్న నేపథ్యంలో ఈసారి తుంగభద్ర జలాశయంకు 172 టీఎంసీలు వరద నీరు చేరుతుందని సమావేశంలో అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, కర్ణాటక ఇంజినీర్లు అధికారులు పాల్గొన్నారు.
ధర్మవరం పట్టణానికి చెందిన నాగజ్యోతి, తేజ్ దీపిక అనే బాలికలు అండర్ 19 అనంతపురం జిల్లా జట్టుకు ఎంపికైనట్లు క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ధర్మవరం కళాశాల మైదానంలో బాలికలు ఇద్దరినీ ఆయన అభినందించారు. జూన్ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెంకటగిరిలో జరిగే అండర్ 19 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో వీరు పాల్గొంటారని కోచ్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.