India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరదేవితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. హిందూపురం కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ అభిషేక్ కుమార్‌కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన మాట్లాడుతూ..
హిందూపురంలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ కేంద్రం వరకు ఊరేగింపుగా వచ్చారు.
అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల 1946వ సంవత్సరంలో స్థాపించబడింది. అనంతరం 2008 సంవత్సరంలో యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. కాగా ఈ యూనివర్శిటీ నేటితో 78 సంవత్సరాలు పూర్తి చేసుకోనుండడంతో శుక్రవారం సాయంత్రం వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, DRDO మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి వంటి వారు ఇక్కడే చదువుకున్నారు.
అనంతపురం జిల్లాలో శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలో ఈనెల 23 నుంచి డిగ్రీ పరీక్షలు జరగనున్నట్లు పరీక్షల విభాగ అధిపతి ఆచార్య జీవి రమణ తెలిపారు. 2,4,6 సెమిస్టర్లు జరగనున్నట్లు తెలిపారు. కళాశాలల్లో పరీక్షలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులు అందరు పరీక్షలు ప్రశాంతంగా రాసుకోవచ్చని తెలిపారు.
శింగనమలలో నామినేషన్ వేసిన బండారు శ్రావణి శ్రీ ఆస్తిపాస్తులు, విద్యార్హత, కేసుల వివరాలను అఫిడవిట్ లో పేర్కొన్నారు. శ్రావణి ఎంఎస్ చదివారు. కాగా ఆమె పేరిట చరాస్తులు- రూ. 89.67 లక్షలు, బంగారం- 612.5 గ్రాములు, అప్పులు- రూ.22.59 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు.
తాడిపత్రి MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 2020లో జేసీ ప్రభాకర్ ఇంట్లోకి చొరబడిన ఘటనలో పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు కాగా ఒక ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు 5 కేసులు ఉన్నాయి. కాగా ఇతని పేరిట రూ.76 లక్షల చరాస్తులు, రూ.35 లక్షల స్థిరాస్తులు, రూ. 2.46 కోట్ల అప్పులు ఉన్నాయని సమాచారం. అయితే పెద్దారెడ్డి భార్య పేరిట రూ. 1.49 కోట్ల చరాస్తులు, రూ.13 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
అనంతపురం జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఆలూరు అగ్రహారం కొండవద్ద హెలికాఫ్టర్లో బయలుదేరి 5.10 గంటలకు కణేకల్లు క్రాస్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 5.15 గంటలకు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 5.25 గంటలకు కణేకల్లు బస్టాండ్ సెంటర్ కు చేరుకుంటారు. 6.00-7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ఠ ధర రూ.37 వేలు పలికింది. కనిష్ఠ ధర రూ.19 వేలు, సరాసరి ధర రూ.26 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. మార్కెట్ కు మొత్తం 991 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి వెల్లడించారు. .
ధర్మవరం వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరులతో కలిసి సాదాసీదాగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ధర్మవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
వజ్రకరూర్ మండలం చాబాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో పిడుగుపాటుకు గురై వినోద్ (27) అనే యువకుడు మృతి చెందాడు. పొలంలో మిర్చిని సంచులలో నింపి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్థులు గమనించి వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్‌లకు మెుదటి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్ట మొదటి నామినేషన్ వేసిన అభ్యర్థిగా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ నిలిచారు.
Sorry, no posts matched your criteria.