Anantapur

News June 5, 2024

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ శాఖ సిబ్బంది సమిష్టిగా పనిచేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయడం హర్షనీయమన్నారు.

News June 5, 2024

శ్రీ సత్యసాయి: వ్యక్తి మృతదేహం లభ్యం

image

మడకశిర మండల పరిధిలోని గుర్రప్పకొండ గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం సగం కాల్చినట్టు గుర్తించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 5, 2024

అనంత జిల్లాలో గెలుపొందిన అభ్యర్థుల మెజార్టీలు ఇవే..!

image

అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగించింది. 8 స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొందారు.
☞ బండారు శ్రావణి శ్రీ 8,788
☞ అమిలినేని సురేంద్ర బాబు 37,734
☞ పయ్యావుల కేశవ్ 21,704
☞ పరిటాల సునీత 23,329
☞ జేసీ అస్మిత్ రెడ్డి 25,865
☞ గుమ్మనురు జయరాం 6,826
☞ కాలవ శ్రీనివాసులు 41,659
☞ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 23,023

News June 5, 2024

భద్రతా చర్యలు చేపట్టిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: ఎస్పీ

image

కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు భద్రతా చర్యలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర బలగాలతో జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఎస్పీ సమావేశమయ్యారు. అందరూ సమష్టిగా కష్టపడటం వల్లే జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు.

News June 5, 2024

ఫలించిన ‘శింగనమల’ సెంటిమెంట్.. ఉరవకొండ బద్దలు

image

రాష్ట్ర రాజీకీయాల్లో శింగనమల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది. 1978 నుంచి వస్తున్న ఈ సెంటిమెంటును టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలిచి నిరూపించారు. మరోవైపు ఉరవకొండలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటుందని.. 20 ఏళ్లగా వస్తున్న సెంటిమెంటును పయ్యావుల కేశవ్ మరోసారి గెలిచి దానిని రూపుమాపారు.

News June 5, 2024

జిల్లా మారినా.. గుమ్మనూరుకే పట్టం

image

గుమ్మనూరు జయరామ్‌కు గుంతకల్లు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థిపై 6,826 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి YCP తరఫున గెలిచి మంత్రిగా పనిచేశారు. 2024లో ఆలూరు నుంచి టికెట్ దక్కకపోవడంతో TDPలో చేరి గుంతకల్లు సీటు దక్కించుకున్నారు. గుమ్మనూరు బ్రదర్స్ నియోజవకవర్గంలో మకాం వేసి గెలుపునకు కష్టపడ్డారు. జిల్లా ఏదైనా విజయం తమదే అంటూ గుమ్మనూరు అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News June 5, 2024

‘ధర్మవరం’ గెలుపు నిజంగా సంచలనమే

image

‘ధర్మవరంలో కేతిరెడ్డిపై గెలవడమంటే అంత ఈజీ కాదు’ ఇది ఎన్నికల వరకు జరిగిన చర్చ. ఫలితం తర్వాత కేతిరెడ్డి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కేవలం 40 రోజుల్లోనే.. ఈ నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన సత్యకుమార్ యాదవ్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. కూటమి, స్థానిక నేతలతో సమన్వయం, అమిత్ షా వంటి జాతీయ నేతల అండతో సంచలన విజయం సాధించారు.

News June 5, 2024

మీ సహకారానికి కృతజ్ఞతలు: కలెక్టర్

image

కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జేఎన్టీయూలోని కౌంటింగ్ కేంద్రంలో మాట్లాడుతూ నెల రోజులుగా కౌంటింగ్ ప్రక్రియలో ఆర్వోలు, నోడల్ అధికారులు, ఏఆర్వోలు, సూపర్ వైజర్లు, పోలీస్ అధికారులు ఎంతో శ్రమించారని అన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అన్ని విధాల సహకరించారన్నారు.

News June 5, 2024

అనంతపురం ఎంపీగా అంబికా విజయం.. ధ్రువీకరణ పత్రం అందజేత

image

అనంతపురం ఎంపీగా టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఘన విజయం సాధించారు. ఆయనకు 7,51,109 ఓట్లు, వైసీపీ అభ్యర్థి శంకర నారాయణకు 5,69,766 వచ్చాయి. వైసీపీ అభ్యర్థిపై 1,81,333 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల్లో విజయం సాధించిన అంబికాకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ డిక్లరేషన్ పత్రం అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

News June 4, 2024

ఉమ్మడి అనంతపురం జిల్లాలో గెలిచింది వీరే..

image

<<13379807>>అనంత<<>>: దగ్గుపాటి ప్రసాద్ > రాప్తాడు: సునీత
ధర్మవరం: సత్యకుమార్(BJP) > పెనుకొండ :సవిత
హిందూపురం: బాలకృష్ణ > మడకశిర: ఎంఎస్ రాజు
పుట్టపర్తి: పల్లె సింధూర > కదిరి: కందికుంట
ఉరవకొండ: పయ్యావుల > కళ్యాణదుర్గం: సురేంద్రబాబు
గుంతకల్లు: గుమ్మనూరు > శింగనమల: బండారు శ్రావణి
తాడిపత్రి: అస్మిత్ > రాయదుర్గం: కాల్వ