India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లేపాక్షి ఆలయాన్నికి రామాయణంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుని తీసుకెళుతుండగా కూర్మ పర్వతంపైన జటాయువు అడ్డగిస్తాడు. రావణుడు అడ్డొచ్చిన ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలంలో పడిపోయింది. సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు విషయం తెలుసుకుని ఆ పక్షికి మోక్షమిచ్చి లే పక్షీ అని పలికాడు. ఆ పదమే కాలక్రమేణా లేపాక్షిగా మారిందని స్థలపురాణం.
మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాలలో గుంతకల్లు పట్టణానికి చెందిన ధనుశ్‌కు జాతీయస్థాయిలో 480వ ర్యాంకు వచ్చింది. గుంతకల్లు పట్టణంలో పుట్టి పెరిగిన ధనుశ్ బీటెక్ పూర్తి చేశారు. సివిల్స్ పరీక్షలకు తాను ఎటువంటి కోచింగ్ తీసుకోలేదని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను, ఆంగ్ల దినపత్రికలను చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ లో రాసుకుంటూ పరీక్షలకు సిద్ధమైనట్లు ఆయన చెప్పారు.
కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో ఇంటి చిరునామా మార్పు కోసం ఫాం-6, 8ల క్లెయిమ్స్ ఈ నెల 25లోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం అనంత కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ నెల 14 దాకా ఆ రెండు రకాల ఫారాలను తీసుకున్నాం. ఇప్పటిదాకా వచ్చిన వాటిని పరిష్కరించే దిశగా కసరత్తు సాగుతోందన్నారు.
అనంతపురం జిల్లాలో టీసీసీ – 2024 డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈనెల 22 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ వరలక్ష్మీ తెలిపారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 18 నుంచి 20 వరకూ ప్రీ పీహెచ్డీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. ఎస్కేయూ లోని కెమిస్ట్రీ గ్యాలరీలో పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే మే 4 నుంచి ఎస్కేయూ పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఆరంభమవుతాయని తెలిపారు.
యల్లనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులురాలిగా విధులు నిర్వహిస్తున్న విజయకుమారిని సస్పెండ్ చేసినట్లు ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలు వాట్సాప్ గ్రూపులలో నిబంధనలకు విరుద్ధంగా పంపడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అనంతపురం JNTU పరిధిలో నిర్వహించిన M.Tech 1వ, 3వ సెమిస్టర్ (ఆర్21) రెగ్యులర్, సప్లిమెంటరీ, M.Tech 1వ, 3వ సెమిస్టర్ (ఆర్17) సప్లిమెంటరీ, M.Tech 2వ సెమిస్టర్ (ఆర్21), (ఆర్17) సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ బి.చంద్రమోహన్రెడ్డి తెలిపారు. పరీక్ష ఫలితాల కోసం www.jntua.ac.in ను సంప్రదించాలని సూచించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో తాగునీరు, విద్యుత్ సరఫరా, జాతీయ ఉపాధి హామీ పథకం పనులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంగళవారం సాయంత్రం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్సి మల్లికార్జున, డ్వామా పీడీ విజయేంద్ర బాబు పాల్గొన్నారు.
నార్పల మండల కేంద్రంలో ఈనెల 18న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించనున్నారు. సభ ఏర్పాట్లను సింగనమల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి శైలజనాథ్, డీసీసీ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన పనుల గురించి నాయకులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరు మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు.
చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం పెట్రోల్ బంక్ వద్ద ఓ వాహనం ఢీకొని విద్యుత్ లైన్‌మెన్ మురళీ అక్కడికక్కడే మృతి చెందాడు. ధర్మవరం నుంచి స్వగ్రామం నాగసముద్రం గేట్‌కు బైక్‌పై వస్తుండగా. పెట్రోల్ బంక్ దగ్గర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మురళీ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. మురళీ ప్రస్తుతం బసినేపల్లి జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.