Anantapur

News June 15, 2024

30 తులాల బంగారు నగలు స్వాధీనం

image

అనంతపురంలో శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. అయితే గంటల వ్యవధిలోనే పోలీసులు ఆ కేసును ఛేదించారు. డీఎస్పీ ప్రతాప్ అందించిన వివరాల మేరకు.. భవానీ నగర్‌కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో ఖాజాపీర్ 30 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదును దొంగలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

News June 15, 2024

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 2,795 మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 8500292992కు సంప్రదించాలన్నారు.

News June 15, 2024

అనంత: బస్సు ఢీకొని రైతు మృతి

image

గుమ్మఘట్ట మండలం క్రిష్ణాపురానికి చెందిన రైతు మంజునాథ(55) శుక్రవారం రాత్రి బస్సు ఢీకొని మృతిచెందారు. మంజునాథ సాగుచేసే దానిమ్మ పంటకు మందులు తెచ్చేందుకు బైక్‌పై కర్ణాటక వెళ్లారు. తిరిగి స్వగ్రామం వస్తుండగా కర్ణాటక ప్రాంతం హనుమంతపల్లి క్రాస్ వద్ద బైక్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు మృతిచెందారు. పోలీసులు విచారణ చేపట్టారు.

News June 15, 2024

అనంత: రానున్న ఐదు రోజుల్లో వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి పేర్కొన్నారు. వచ్చే 5 రోజుల్లో పగలు ఉష్ణోగ్రత 32.4 నుంచి 34.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత 23.8 నుంచి 24.7 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

News June 15, 2024

తాడిపత్రిలో వృద్ధుడిని ఢీకొట్టిన గూడ్స్ రైలు

image

తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు ఢీకొని ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే ఎస్సై నాగప్ప తెలిపిన వివరాల మేరకు.. రాజంపేటకు చెందిన యల్లయ్య తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద మూత్రవిసర్జన చేస్తున్నారు. ఆ సమయంలో గూడ్స్ రైలు ఢీకొంది. గమనించిన స్థానికులు యల్లయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తీసుకెళ్లారు.

News June 15, 2024

నెల్లూరు జట్టుపై అనంతపురం జట్టు విజయం

image

ఎంకే దత్తారెడ్డి (122) వీర విహారం చేయడంతో సౌత్‌జోన్‌ అంతర్‌ జిల్లా అండర్‌-23 క్రికెట్‌ పోటీల్లో అనంతపురం జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం అనంత క్రీడా గ్రామంలో ప్రారంభమైన వన్‌డే పోటీలో నెల్లూరు జట్టును 39 పరుగుల తేడాతో ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన అనంత జట్టు దత్తారెడ్డి శతకంతో 25 ఓవర్లలో 9 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెల్లూరు జట్టు 23.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది.

News June 15, 2024

నేడు ఉపాధిహామీ పనులను పరిశీలించనున్న అనంత కలెక్టర్

image

కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలైన శెట్టూరు, కుందుర్పి, కళ్యాణదుర్గం మండలాల్లో శనివారం అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించనున్నారు. పైన తెలిపిన మండలాల్లో జరిగిన పలు రకాల ఉపాధిహామీ పనుల నాణ్యత, అవకతవకలపై పరిశీలించనున్నారు. కావున సంబంధిత విభాగాలకు చెందిన అధికారులు తప్పక హాజరు కావాలని అధికారులు తెలిపారు.

News June 15, 2024

అనంత కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న వీరన్న, హరికృష్ణ

image

అంతర్జాతీయ రక్త దాతల దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా గుమ్మగట్ట, రాయదుర్గానికి చెందిన యువకులు అవార్డులు అందుకున్నారు. అత్యధికసార్లు రక్తదానం చేయడమేకాక విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు గుమ్మగట్ట ఎం.జి వీరన్న, రాయదుర్గం హరికృష్ణలు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. వారికి కలెక్టర్ ఆవార్డులు అంజేసి అభినందించారు.

News June 14, 2024

అన్ని లెక్కలు బయటకు తీస్తాం.. పేదలకు న్యాయం చేస్తాం: పరిటాల సునీత

image

గత ఐదేళ్లలో పేదల ఇళ్ల మాటున కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి చేసిన అవినీతి లెక్కలను బయటకు తీస్తామని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఆమె క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశమై నియోజకవర్గంలో నిధులు ఉండి పనులు చేయని రోడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News June 14, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

గుమ్మగట్ట మండలం కృష్ణాపురానికి చెందిన మంజునాథ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలోని హనుమంతపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం బైక్‌పై కౌండపల్లికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.