Anantapur

News April 13, 2024

ఉరవకొండ మండలంలో రోడ్డు ప్రమాదం

image

ఉరవకొండ మండలం పెన్నహోబిలం సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన బొలెరో వాహనం నిలిపి మధ్యలో రాళ్లు పెట్టడంతో ఉరవకొండ నుంచి మదనపల్లికి బైక్‌పై వెళ్తున్న గిరీష్ బాబు, ఆంజనేయులు వాటిని ఎక్కించి కిందపడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బోలెరో డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

News April 13, 2024

ఎన్నికల విధులకు హాజరు కాకుంటే సస్పెన్షన్ తప్పదు: కలెక్టర్

image

ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది విధులకు హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తామని సత్యసాయి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందికి ఇప్పటికే ఒక విడత శిక్షణ పూర్తి చేశామని, మరోసారి శిక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News April 13, 2024

అనంత: పెన్నానది నీటిలో మృతదేహం లభ్యం

image

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం సమీపంలోని పెన్నానదిలో శుక్రవారం ఓ గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. అక్కడి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తి వివరాల కోసం విచారణ చేపట్టినట్లు అర్బన్ సీఐ సురేష్ బాబు తెలిపారు.

News April 13, 2024

శ్రీ సత్యసాయి: ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం

image

చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన చైతన్య, ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన మానస అనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వారు ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది సూపర్ వాస్మోల్ ద్రావణాన్ని తాగారు. వారిని కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

News April 13, 2024

మొదటి విడత ఈవీఎం రాండమనైజేషన్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్

image

ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఈవీఎం రాండమనైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వైబ్ సెట్ లో పూర్తి అయిందని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఈ ఎం ఎస్ 2 వ నిర్దేశిత వెబ్ సైట్ లో మొదటి విడత ఈవీఎం రాండమనైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి అయిందని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 12, 2024

రోజువారి నివేదికలను ఎన్నికల కమిషన్ కు పంపించాలి: కలెక్టర్

image

ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి రోజు వారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు పంపించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఎన్నికల నివేదికల సమర్పణ, సీ విజిల్, సువిధ యాప్, కంట్రోల్ రూమ్ నిర్వహణ, తదితర అంశాలపై కంట్రోల్ రూమ్ నుంచి రోజు వారి నివేదికలను కమిషన్‌కు పంపించాలని తెలిపారు.

News April 12, 2024

శ్రీ సత్యసాయి: ఫుడ్ పాయిజన్‌తో 90 మందికి అస్వస్థత

image

సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లి మిద్దెలలో శుక్రవారం ఫుడ్ పాయిజన్‌తో 90 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో రాముడి గుడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదానంలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులతో పాటు మరో 40 మందికి పైగా గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 12, 2024

స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన ఎస్పీ

image

అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ జిల్లా కేంద్రంలోని పాత ఆర్డీఓ ఆఫీసులో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. శింగనమల, అనంతపురం అర్బన్, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరచనున్న స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, జూనియర్ కళాశాల, సుబీన్ కళాశాలను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డీఎస్పీ పాల్గొన్నారు.

News April 12, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో 12,000 మంది ఉద్యోగులకు పోస్టర్ బ్యాలెట్ సౌకర్యం

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికల విధులకు కేటాయించిన 12,000 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణ లక్ష్యంతో సంబంధిత అధికారులు పనిచేయాలన్నారు.

News April 12, 2024

నిర్భయంగా ఓటు వేయండి.. ప్రశాంత ఎన్నికలకు సహకరించండి: ఎస్పీ

image

ఎన్నికల వేళ ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ అమిత్ బర్దర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు మండలం పంపనూరులో శుక్రవారం కేంద్ర సాయుధ బలగాలచే నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌లో ఎస్పీ పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలే తమ లక్ష్యమన్నారు. నిర్భయంగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత ఎన్నికలకు అందరూ సహకరించాలని కోరారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు.