India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శెట్టూరు మండలంలో అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పరిగిలో 40.0, బొమ్మనహాళ్ 39.8, చెన్నేకొత్తపల్లి 39.7, తాడిపత్రి 39.5, పెద్ద వడుగూరు, కొత్తచెరువు 39.2, తలుపుల, రొద్దం 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వారు తెలిపారు.
అనంతపురం జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. నార్పల మండల కేంద్రంలోని 1, 2 సచివాలయాల్లో ఏడుగురు వాలంటీర్లను, సిద్ధరాచెర్ల గ్రామ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు, రాప్తాడు మండలం బొమ్మేపర్తి ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి తప్పక పాటించాలన్నారు.
రాయదుర్గం మండలంలోని కొంతనపల్లికి చెందిన గొర్రెల కాపరి బోయ వన్నూరప్ప(65) వడదెబ్బతో మృతి చెందాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్నూరప్ప ఎప్పటిలాగే మంగళవారం కూడా తనకున్న సుమారు 50 గొర్రెలను మేపుకోసం కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మంగళవారం సాయంత్రం వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా అక్కడి నుంచే నేరుగా గుండ్లపల్లికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రాత్రి పరిస్థితి విషమించి మృతిచెందాడు.
రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పురుషోత్తం రెడ్డి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం పురుషోత్తం రెడ్డి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాజీ ఏపీఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇక్బాల్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్బాల్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. గత ఎన్నికలలో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇక్బాల్.. బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు.
ఉగాది సందర్భంగా అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. మార్కెట్‌కు మంగళవారం 355 టన్నులు మాత్రమే రైతులు తీసుకొచ్చారు. పంట తక్కువ వచ్చినా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. పండగ కారణంగా సరకు రావడం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్ యార్డు సంతలో టన్ను గరిష్ఠ ధర రూ.36 వేలు, మధ్యస్థ ధర రూ.21 వేలు, కనిష్ఠ ధర రూ.14 వేలుగా ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో 179 మంది సెక్టార్ అధికారులతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మడకశిర నియోజకవర్గానికి 25 మంది, హిందూపురానికి 32, పెనుకొండకు 29, పుట్టపర్తికి 26, ధర్మవరానికి 35, కదిరి నియోజకవర్గానికి 32 మంది సెక్టర్ అధికారులను నియమించామన్నారు.
పోలింగ్‌కు అన్ని కేడర్ల అధికారులు, సిబ్బంది కలిపి దాదాపు 24 వేల మందిని నియమించారు. పీఓలు 2,552, ఏపీఓలు 2,715, ఓపీఓలు 9 వేలకు పైగా, పోలీసు సిబ్బంది 3,500, ఎన్నికల నిర్వహణ కమిటీల సిబ్బంది 570, నోడల్ అధికారులు 33 మంది, సెక్టార్ అధికారులు 481 మంది ఉన్నారు. వివిధ స్థాయిల్లో 33 శాఖలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు.
కూడేరు: పది రోజులుగా మార్కెట్‌లో టమాటా ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో రూ.40 పలుకుతోంది. ఇన్ని రోజులూ కిలో రూ.10 లోపే ఉండేది. మండల వ్యాప్తంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. 15 కేజీల టమాట బాక్స్ ధర నాణ్యతను బట్టి రూ.300 నుంచి రూ.450 వరకు పలుకుతోంది. ధర పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీ విద్య, వైద్య విభాగం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా గౌతమిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. చిత్తూరు జిల్లా వాసి అయిన ఈమె గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎండోమెంట్ రెవెన్యూ విభాగంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బదిలీ నిమిత్తం తిరుపతి జేఈఓగా వెళ్లనున్నారు.
Sorry, no posts matched your criteria.