Anantapur

News April 10, 2024

ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: ఎస్పీ

image

అనంతపురం నగరంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని STPO కార్యాలయంలో నగర పోలీస్ అధికారులతో సమావేశమై, ఎన్నికల వేళ తీసుకోవలసిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. నగరం, పోలీస్ స్టేషన్ల పరిధిలో, భౌగోళిక స్థితిగతులు, పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

News April 9, 2024

అనంత: ‘ఎన్నికల మస్కెట్ రూపొందించండి’

image

సార్వత్రిక ఎన్నికల మస్కట్ రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. ఎన్నికల మస్కట్ రూపకల్పనలో జిల్లా ప్రజలు, డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్లు, కేజీబీవీ పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఇంజనీరింగ్ కళాశాలలు, జేఎన్టీయూ, ఎస్కేయు, పెయింటింగ్ సంస్థలు ఎన్నికల మస్కట్ రూపకల్పనలో పాలుపంచుకోవచ్చన్నారు.

News April 9, 2024

అనంత: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామంలో మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న పుల్లన్న పొరపాటున మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగినట్లు సమాచారం. అయితే తాగిన గంటలోనే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెద్దవడుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 9, 2024

సోమఘట్ట వాసి తెలంగాణలో అనుమానాస్పద మృతి

image

చిలమత్తూరు మండలంలోని సోమఘట్టకు చెందిన నరసింహులు (40) తెలంగాణాలోని గద్వాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం చిలమత్తూరు ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమఘట్టకు చెందిన టీడీపీ నాయకుడు తిప్పారెడ్డికి గద్వాల్లో కోళ్ల ఫారంలో పనిచేసేందుకు నరసింహులు వెళ్లారు. అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News April 9, 2024

అనంతలో ఈసెట్‌కు 26,436 దరఖాస్తులు

image

అనంతపురం జిల్లా ఏపీ ఈసెట్ 2024కు మొత్తం 26,436 దరఖాస్తులు అందినట్లు ఏపీ ఈసెట్ రాష్ట్ర ఛైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాస్ రావు, రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి మీడియాకు తెలిపారు. ఏపీ ఈసెట్ దరఖాస్తుకు ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉందన్నారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 22 వరకు, రూ.2వేల అపరాధ రుసుముతో ఈనెల 29 వరకు, రూ.5వేల రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News April 9, 2024

అనంత: హుబ్లీ- విజయవాడ మధ్య ఉగాది ప్రత్యేక రైలు

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రైళ్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం హుబ్లీ-విజయవాడ- హుబ్లీ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ-హుబ్లీ (నెం.07001) ప్రత్యేక రైలు ఈ నెల 10న విజయవాడలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు హుబ్లీ చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలని కోరారు.

News April 9, 2024

అనంత: పండుగ రోజే వివాహిత ఆత్మహత్య

image

పామిడి మండలం పాళ్యం తండాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక అనే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పామిడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

News April 9, 2024

కేశేపల్లిలో చేనేత కార్మికుడి ఆత్మహత్య

image

నార్పల మండల పరిధిలోని కేశేపల్లిలో సోమవారం రాత్రి నాగానంద అనే చేనేత కార్మికుడు తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగానందం ఆర్థిక ఇబ్బందులతోనే ఉరి వేసుకున్నాడని స్థానికులు తెలిపారు. మృతుడు నాగానందానికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

News April 9, 2024

శ్రీ సత్యసాయి: సచివాలయ సర్వేయర్ మృతి

image

పరిగి మండలం ఎర్రగుంట్ల సచివాలయ పరిధిలో పనిచేస్తున్న సర్వేయర్ రాజేశ్వరి సోమవారం రాత్రి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సర్వేయర్ మృతి పట్ల తోటి ఉద్యోగులు సంతాపం తెలిపారు.

News April 9, 2024

తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు: కలెక్టర్

image

పుట్టపర్తి టౌన్ క్రోధినామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ఈ ఉగాది అందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలని కలెక్టర్ అరుణ్బాబు, ఆకాంక్షించారు. క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీస్, జిల్లా యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కొత్త ఆలోచనలతో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.