India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురము నగరంలోని కలెక్టరేట్‌లోని మినీ హాలులో మంగళవారం రెండవ రోజు ఎంపీ అభ్యర్థుల సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ల నియామకం & విధులపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
కదిరిలోని నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్స్ నిర్వహిస్తూ పాఠ్య పుస్తకాలను యూనిఫామ్‌లు విక్రయిస్తున్న స్కూల్‌ను డీఈవో మీనాక్షి మంగళవారం సీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో అక్రమ పద్ధతుల్లో అడ్మిషన్స్ నిర్వహిస్తూ అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తునందుకు స్కూల్ సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన XUV 3XO శ్రేణి వాహనాలను అనంతపురం ఎంజీబీ మొబైల్స్ వారు ఒకేరోజు 30 డెలివరీ చేశారు. ఆదివారం ఒక్కరోజే ఈ ఘనత సాధించినట్లు ఎంజీబీ మొబైల్స్ సీఈఓ ఆదిత్య మాచాని తెలిపారు. కార్యక్రమంలో సేల్స్ జనరల్ మేనేజర్ వంశీకృష్ణ, సేల్స్ మేనేజర్ మస్తాన్ వలీఖాన్, పీవీకేకే ఐటీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ జీఎన్ఎస్ వైభవ్ తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షి మండలం చోళసముద్రంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూములను మంగళవారం కలెక్టర్/హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందికి తగు జాగ్రత్తలు చెప్పారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అనంతపురంలోని రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్లో ఎస్ఎస్ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మాల్ కాపియింగ్ చేయకుండా ఇన్విజిలేటర్లు అబ్జర్వ్ చేయాలని తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు రాయడానికి వెలుతురు, గాలి ఉండేటట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం నందరాజనపల్లిలో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న బాలికను సోమవారం అర్ధరాత్రి పాము కాటువేసింది. దీంతో నాలుగో తరగతి చదువుతున్న ఖుషీ అనే తొమ్మిదేళ్ల బాలిక మృతిచెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గురుకుల పాఠశాలలో ఈనెల 29న 5వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆ విద్యాలయాల సమన్వయకర్త మురళీకృష్ణ తెలిపారు. గతంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తామని చెప్పారు. బాలుర విభాగంలో 26, బాలికల విభాగంలో 12 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.
SBI కదిరి వ్యవసాయ శాఖ విభాగంలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన రూ.1.50 కోట్లకు పైగా నగదును ఇతర ఖాతాలకు మళ్లించి తాను వాడుకున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో SBI రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చిలో ఆయనపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.
బీఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు జేఎన్టీయూ పరీక్షల విభాగం అధికారులు కేశవ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఫలితాల కోసం జేఎన్టీయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.
కడపలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సౌత్ జోన్ అంతర్ జిల్లా సీనియర్ వన్డే క్రికెట్ పోటీల్లో పాల్గొనే అనంతపురం జట్టుకు గిరినాథ్ రెడ్డిని కెప్టెన్‌గా నియమించారు. ఈయన రంజీ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3 వరకు ఈ పోటీలు నిర్వహిస్తారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా కూడా పాల్గొంటుందని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధు ఆచారి తెలిపారు.
Sorry, no posts matched your criteria.