India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని హుస్నాబాద్ సమీపంలోని ఓ వర్గం శ్మశాన వాటిక వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘర్షణ చోటు చేసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు గొడవకు దిగారు. బందోబస్తుకు వెళ్లిన ఏఎస్ఐ, పలువురు కానిస్టేబుల్ లపై ఆందోళన కారులు దాడులు నిర్వహించారు. దీంతో గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరిని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ శనివారం సస్పెండ్ చేశారు. గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామ వాలంటీరు పి.రమేశ్, యాడికి మండలం రాయలచెరువు-7 అంగన్‌వాడీ వర్కర్ పి.అనసూయ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇదిలా ఉండగా.. ఎఫ్‌ఎస్, ఎస్‌ఎస్ టీముల ద్వారా ఇప్పటి వరకు రూ.2,05,00,563 నగదు సీజ్ చేశారు.
ఎన్నికలకు అన్నిరకాల పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టామని
జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతపురం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఎన్నికల సంసిద్ధత, ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్ఠంగా అమలు, ముందస్తు ఏర్పాట్లు, తదితర అంశాలపై కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా నూతన కలెక్టర్, ఎన్నికల అధికారి డా.వి.వినోద్ కుమార్‌ని శనివారం రాయదుర్గం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిని కరుణకుమారి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు వి.శ్రీనివాసులు రెడ్డి, రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతపురంలో టమాటా ధర కొండెక్కింది. కిలో ధర రూ.50కు చేరింది. నెలలుగా కిలో రూ.20లు దాటని ధర అమాంతం పెరిగింది. టమాటా సాగు చేస్తున్న రైతులు, టోకు వ్యాపారులను పెరిగిన టమాటా ధర ఆనందం కల్గిస్తుంటే.. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉరవకొండ పట్టణంలోని మల్లేశ్వర ఆలయ సమీపంలో నివసిస్తున్న దునోజ్ కుమార్(18) మూడు రోజుల కిందట వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఉన్న ఒక కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు మల్లికార్జున, రేణుకమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో సమ్మెటివ్-2 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ మీనాక్షి తెలిపారు. 1 నుంచి 9వ తరగతులకు – ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. 6 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీఈఓ ఆదేశించారు.
సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి రోజు వారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు పంపించాలని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఎన్నికల నివేదికల సమర్పణ, సి విజిల్, సువిధ యాప్, కంట్రోల్ రూమ్ నిర్వహణ, తదితర అంశాలపై ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి నివేదికలు పంపించాలన్నారు.
సాధారణ ఎన్నికలు 2024 కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.వి.వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి అనంతపురం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు.
చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామానికి చెందిన వీరనారమ్మ(48) తన ఇంటి ముందు స్టూల్ మీద నిలబడి తన ఇంటి గోడకు సున్నం కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కిందపడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను CK పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి మృతి చెందిందని నిర్ధారించారు. వీరనారమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.