Anantapur

News June 20, 2024

అనంత: 29న జాతీయ లోక్ అదాలత్

image

ఈ నెల 29న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ సూచించారు. బుధవారం జిల్లా జడ్జి ఛాంబర్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఉమ్మడి జిల్లా ఎస్పీలు గౌతమి శాలి, మాధవరెడ్డిలతో సమావేశమయ్యారు. లోక్ అదాలత్‌‌పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News June 19, 2024

ATP: జిల్లా మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

image

జిల్లా మంత్రులందరికీ సాధారణ పరిపాలన శాఖ అమరావతిలోని సచివాలయంలో ఛాంబర్లు కేటాయించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు రెండో బ్లాకులోని తొలి అంతస్తులో 212వ ఛాంబరు కేటాయించారు. ఇవాళ ఆయన బాధ్యతలు చేపట్టారు. వైద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఐదో బ్లాకు గ్రౌండ్‌ ఫ్లోర్‌‌లో 211వ ఛాంబర్ కేటాయించగా ఈ నెల 16న బాధ్యతలు చేపట్టారు. మంత్రి సవితకు నాలుగో బ్లాకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 131వ ఛాంబర్ కేటాయించారు.

News June 19, 2024

ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్

image

విజయవాడ సచివాలయంలో బుధవారం శాసన సభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన మంత్రికి సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ అధికారులు పాల్గొన్నారు.

News June 19, 2024

కోన ఉప్పలపాడు జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా చేయండి

image

యాడికి నుంచి 13కి.మీ దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య వెలసిన కోన రామలింగేశ్వరుడు ఆలయం ప్రకృతి అందాలకు నెలవుగా మారింది. ఆలయం ఎదుట కొండపై నుంచి దూకుతున్న కోన ఉప్పలపాడు జలపాతం దర్శనమిస్తుంది. దీంతో పాటు ఆలయం వెనుక ఎకరా విస్తీర్ణంలో విస్తరించిన వందల ఏళ్లనాటి మర్రి చెట్టు, ఆ పక్కనే చెరువు ఉండటంతో పర్యాటకుల మనసు దోచుకుంటుంది. ఈ ప్రాంతాన్ని పర్యాట కేంద్రంగా అభివృద్ధి చేయాలనడంపై మీ కామెంట్.

News June 19, 2024

కళ్యాణదుర్గం: రోడ్డుపైకి రెండు ఎలుగుబంట్లు

image

కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని కన్నేపల్లి రోడ్డుపైకి మంగళవారం సాయంత్రం రెండు ఎలుగుబంట్లు రావడం చూసి అటుగా వెళుతున్న ప్రయాణికులు భయాందోళన చెందారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని భయంతో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను అటవీ ప్రాంతాల్లో వదిలేయాలని కోరారు.

News June 19, 2024

భూసేకరణపై దృష్టి సారించాలి: అనంతపురం జిల్లా కలెక్టర్

image

జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులు, ఏపీఐఐసీ, సోలార్ ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్, ఎంఐజి లేఅవుట్, రైల్వే, సాంఘిక సంక్షేమ శాఖల భవనాలకు సంబంధించి భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. భూ కేటాయింపు ప్రక్రియపై పలు సూచనలు చేశారు.

News June 18, 2024

మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ను కలిసిన జిల్లా అధికారులు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను సత్యసాయి జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డితో పాటు పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం సత్యసాయి జిల్లా పరిస్థితులపై చర్చించారు.

News June 18, 2024

ATP: 5,27,620 మంది రైతులకు రూ.2 వేలు జమ

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలయ్యాయి. జిల్లాలోని రైతులకు రూ.2 వేలు చొప్పున అకౌంట్లలో జమకానుంది. అనంతపురం జిల్లాలోని 2,76,147 మంది రైతులకు రూ.55.23 కోట్లు, సత్యసాయి జిల్లాలోని 2,51,473 మంది రైతులకు రూ.50.29 కోట్ల మేర సాయం అందనుంది. లబ్ధిదారుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఈ లింక్ <>క్లిక్<<>> చేసి చూసుకోవచ్చు.

News June 18, 2024

తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు

image

తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ ఆలయ గోపురాన్ని ఏపీ ప్రభుత్వం 10వ తరగతి పాఠ్యపుస్తకాలపై ముద్రించింది. ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం పెన్నానది ఒడ్డున వెలసింది. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉండటం ఇక్కడి విశిష్టత. అలాగే శివలింగం మీద నేరుగా సూర్యకిరణాలు పడటం, ఆలయంలోని స్తంభాలను చేతులతో టచ్ చేస్తే సప్త స్వరాలు పలుకుతాయి.

News June 18, 2024

మాజీ సీఎం జగన్‌పై అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

image

మాజీ సీఎం జగన్‌పై టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్వి అనంతపురం ఎస్పీ గౌతమి షాలికి ఫిర్యాదు చేశారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు జగనే కారణమని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఎస్పీని కోరారు. ఈమేరకు జిల్లా ఎస్పీ గౌతమి షాలికి వినతి పత్రాన్ని అందజేశారు. ఆమె వెంట జిల్లా టీడీపీ మహిళా నేతలు ఉన్నారు.