India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌లను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలను జారీ చేసింది. అలాగే బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని కోరింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల్లో పాల్గొనకూడదని ఆదేశించింది.
ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ TDP అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి చర్చించినట్లు సత్యకుమార్ ‘X’లో పోస్ట్ చేశారు. YCP అరాచకపాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. మోదీ నేతృత్వంలో, పవన్ సహకారంతో.. చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కానున్నట్లు వివరించారు. అంధకారం తొలిగి వెలుగులు ప్రసరించనున్నట్లు సత్యకుమార్ పేర్కొన్నారు.
సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులును వ్యతిరేకిస్తున్న నియోజకవర్గ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వ్యక్తిని చూసుకోకుండా వ్యవస్థను చూసి పనిచేయాలని జగన్ కోరినట్లు తెలిసింది. జగన్‌ను కలిసిన వారిలో శింగనమల నియోజకవర్గం వైసీపీ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, తరిమెల గోకుల్ రెడ్డి, చెన్నంపల్లి రాజన్న, చాములూరు రాజగోపాల్, తదితరులు ఉన్నారు.
చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో సోమవారం రాత్రి యువ రైతు దొడ్డి నారాయణ(45) గుండెపోటుతో మృతిచెందారు. నారాయణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. సోమవారం రాత్రి తన పొలానికి వెళ్లగా హఠాత్తుగా గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో భార్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
అనంతపురం జిల్లాలో 2,89,131 మంది లబ్దిదారులకు మొత్తం రూ.86.58 కోట్లు నిధులు పించన్ మంజూరైనట్లు పీడీ నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో వృద్ధులు 1,45,839 మందికి గాను రూ.43.75 కోట్లు, వితంతువులు 66,868 మందికి రూ.20 కోట్లు, విభిన్న ప్రతిభావంతులు 46,664 మందికి రూ.13.99 కోట్లు, చేనేతలు 6,793 మందికి రూ.2 కోట్లు, ఒంటరి మహిళలు 6,744 మందికి రూ.2 కోట్లు 3వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు.
మడకశిర నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆర్జీ పవిత్ర పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న ఎన్నికలలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధమన్నారు. ప్రజలు ఎప్పుడూ ప్రధాన పార్టీలను చూసి చూసివిసిగిపోయారని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే కుల, మత, పార్టీలకు అతీతంగా మడకశిరను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.
ఓటు హక్కు పొందేందుకు ఇదే చివరి అవకాశం అని, ఏప్రిల్ ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఈనెల 14వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో ఓటు వేసే అవకాశం లభిస్తుందని, దరఖాస్తు చేసుకుంటే నూతనంగా ఓటు పొందవచ్చునని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను 10 రోజులలో పరిశీలించి కొత్త ఓటు హక్కు కల్పిస్తామన్నారు.
అనంతపురంలోని పాతూరు బ్రాహ్మణ వీధిలో మంజు క్లాత్ స్టోర్ యజమాని అనుముల ఆదినారాయణ వయస్సు రీత్యా సోమవారం మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఆయన నేత్రాలను దానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఆడిటర్ ఆదిశేషయ్య, నాగభూషణం, సాయి ట్రస్ట్ సభ్యులు విజయ సాయికుమార్, నారాయణ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంలోని కేఎస్ఆర్ గవర్నమెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను సోమవారం డీఈఓ బీ.వరలక్ష్మి, ఏసీ గోవింద నాయక్ కలిసి పరిశీలించారు. స్పాట్‌లో పాటించవలసిన నియమ నిబంధనలను సరిగా పాటిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించారు. విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. సోమవారం జగన్ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు మాజీ ఎంపీపీలు వైసీపీలో చేరారు. చిలమత్తూరు మాజీ ఎంపీపీ ఆన్సర్, లేపాక్షి మాజీ ఎంపీపీ హనోక్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.