India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కదిరిలో సోమవారం సీఎం జగన్ పర్యటించనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా
నేటి సాయంత్రం పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ముస్లి సోదరులు పాల్గొనాలని కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ కోరారు. అనంతరం పార్టీలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాష జగన్ సమక్షంలో చేరనున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సుపై చెప్పు విసిరిన ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం శనివారం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
అనంతపురం జిల్లాలో భారీ మొత్తంలో నగదును ఆదివారం పోలీసులు సీజ్ చేశారు. తాడిపత్రి పరిధిలోని బస్ స్టాండ్ వద్ద షేక్ మస్తాన్ హాజీవలి అనే ధనియాల వ్యాపారి వద్ద దాదాపు రూ.1.31 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల అధికారులు పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని షేక్ మస్తాన్ హాజీవలిని విచారిస్తున్నారు. నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు. ఇవాళ వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
అనంత జిల్లాలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ముగ్గురు వాలంటీర్లు, ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను కలెక్టర్ ఎం.గౌతమి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో విడపనకల్లు మండలం హవళిగి గ్రామ వాలంటీర్ కొల్లారప్ప , ఫీల్డ్ అసిస్టెంట్ కె.మల్లికార్జున, అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామ వాలంటీర్లు ప్రవీణ్, ప్రకాష్, తాడిపత్రి మండలం ఆటోనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ షిప్ట్ ఆపరేటర్ పావురాల శీనయ్య ఉన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అంతరాష్ట్ర సరిహద్దులలో జిల్లా పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆదివారం రాత్రి ఎస్పీ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోకి, పట్టణాలలో ప్రవేశించి బస్సులు, లారీలు, కార్లు, తదితర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు నగలను స్వాధీనం చేసుకుంటున్నారు.
ఎన్నికల వేళ సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచామని, వివాదాస్పద పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని అనంత ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమాలలో పాటించాల్సిన నియమ నిబంధనలు, సూచనలపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో తప్పుదారి పట్టించే సమాచారాన్ని పెడితే చర్యలు తప్పవన్నారు.
కదిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేసినట్లు తెలిపారు. టీడీపీలో పార్టీ కోసం కష్టపడిన నేతలకు విలువ లేకుండా పోయిందని అన్నారు. రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపనున్నట్లు పేర్కొన్నారు.
ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన చింత చిదంబరయ్య కుమార్తె చింత రాజేశ్వరి(21) ఆదివారం ఉరివేసుకుని మృతిచెందింది. రాజేశ్వరి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదని, ఆదివారం కూడా నొప్పి రావడంతో భరించలేక ఇంట్లో చీరతో ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
అనంతపురం అసెంబ్లీ టికెట్ రాలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ మారుతున్నారని వస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. అనంతపురంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. సమస్యను అధినేత చంద్రబాబు నాయుడుకు వివరిస్తామని తెలిపారు.
ధర్మవరం టౌన్ కేతిరెడ్డి కాలనీకి చెందిన రాజేశ్వరి (21) అను యువతి తన ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయింది. రాజేశ్వరి పుట్టపర్తిలో సంస్కృతి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. రాజేశ్వరి తండ్రి చిదంబరయ్య కూలి మగ్గం నేస్తారు. రాజేశ్వరి ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.