Anantapur

News June 1, 2024

KK సర్వే.. అనంత జిల్లాలో టీడీపీకి 13, ధర్మవరం బీజేపీదే..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ను కేకే సర్వే వెల్లడించింది. మొత్తం 14 సీట్లకు గాను 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేయనున్నారని వెల్లడించింది. వైసీపీ ఖాతా తెరిచే అవకాశమే లేదని అంచనా వేసింది. ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలవనున్నారని పేర్కొంది. కాగా ధర్మవరంలో మాత్రమే బీజేపీ పోటీ చేయగా సత్యకుమార్ యాదవ్ గెలిచే అవకాశం ఉన్నట్లు పరోక్షంగా తెలిపింది.

News June 1, 2024

చాణక్య స్ట్రాటజీస్.. అనంతపురం జిల్లాలో కూటమికి 9 సీట్లు

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ఎన్నికల సర్వే ఫలితాలను చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకుగాను కూటమి 9, వైసీపీకి 3 విజయం, 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండనుందని వెల్లడించింది.

News June 1, 2024

బాలకృష్ణ భారీ మెజార్టీ.. ఉషశ్రీ, గుమ్మనూరు ఓటమి: ఆరా మస్తాన్

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆరా మస్తాన్ తన సర్వేలో ఫలితాన్ని ప్రకటించారు. అలాగే పెనుకొండ వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి, గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఓడిపోతారని వెల్లడించింది.

News June 1, 2024

చెన్నెకొత్తపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

చెన్నెకొత్తపల్లి మండలం బసంపల్లి వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధర్మవరం పట్టణం ఎల్సీకే పురానికి చెందిన గొల్ల నారాయణ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందిమల్ల కృష్ణయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై చెన్నెకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 1, 2024

అనంతపురం జిల్లాలో 6వేల మంది బైండోవర్

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల అనంతరం వివిధ పార్టీలకు చెందిన ఆరు వేల మందిని బైండోవర్ చేసినట్లు జిల్లా ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. జూన్ 4న జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఏజెంట్లుగా వెళ్లే వారికి ఐడి కార్డు లేకుంటే అనుమతించమని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టుపక్కల నివాసులందరికి నోటీసులు అందించామని వెల్లడించారు.

News June 1, 2024

అనంత: కారు బోల్తా.. ఒకరు మృతి

image

పరిగి మండలం ధనాపురం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు రాష్ట్రం హోసూరు చెందిన వారీగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 1, 2024

సత్యసాయి జిల్లాలో కొనసాగిన విత్తన పంపిణీ

image

శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కొనసాగింది. ఇప్పటిదాకా హిందూపురం పరిధిలో 1469మంది రైతులకు 1065.10 క్వింటాళ్లు, మడకశిరలో 799 మందికి 696.80, పెనుకొండలో 949 మందికి 940.30, కదిరిలో 3512 మందికి 2751.30, ధర్మవరంలో 1453 మందికి 1312.30 క్వింటాళ్లు పంపిణీ చేసినట్టు జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు పేర్కొన్నారు.

News June 1, 2024

రోడ్డు ప్రమాదంలో కొత్తచెరువు వైసీపీ కన్వీనర్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో కొత్తచెరువు వైసీపీ మండల కన్వీనర్ జగన్ మోహన్‌ రెడ్డి మృతిచెందిన ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపాన గల రామాలయం వద్ద బైక్‌లో వెళుతున్న ఆయనను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News June 1, 2024

అనంతపురంలో హలో రైతన్న కార్యక్రమం

image

అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7: 15 నిమిషాల నుంచి 8 గంటల వరకు హలో అనంత రైతన్న ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఉమామహేశ్వరమ్మ , రేకులకుంట వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డి, టెలిఫోన్08554 225533 ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

News June 1, 2024

పెనుగొండలో ఉరి వేసుకొని మహిళ సూసైడ్

image

పెనుగొండలో ఉరి వేసుకుని శనివారం గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద కోడిపల్లి సమీపంలోని ప్రధాన రహదారికి 300 మీటర్ల దూరంలో పంట పొలాల్లో వేప చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మహళను ఎవరైనా గుర్తిస్తే పెనుకొండ సీఐ ,9440796841 ,రొద్దం ఎస్ఐ 9440901902 నంబర్‌లకు ఫోన్ చేయాలన్నారు.