India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాకు రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. సహదేవరెడ్డి, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈనెల 5వ తేదీ వరకు చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని వారు పేర్కొన్నారు.
జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మే 3 నుంచి 10 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. అందులో ఆనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అత్యధికంగా 6,971 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. రెండవ స్థానంలో రాప్తాడు 4,338 ఓట్లు నమోదు అయ్యాయి. రాయదుర్గం 1,671, ఉరవకొండ 2,544, గుంతకల్ 3,612, తాడిపత్రి 2,702, సింగనమల 2,450, కళ్యాణదుర్గం 2,612 ఓట్లు నమోదు అయ్యాయి.
తాడిపత్రి మండలం వంగనూరు క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్-కారు ఢీకొన్న ఘటనలో సుబ్బయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికల ఫలితాల కోసం అనంతపురం జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి అనంతలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.
యాడికి మండలం కేంద్రంలోని హాస్పిటల్ కాలనీలో గీత అనే మహిళ శుక్రవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివాహమై ఐదు సంవత్సరాలు పూర్తయినా.. పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.
తాడిపత్రి అల్లర్ల కేసులో మరో 9 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టుచేసి కడప సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గౌస్ బాషా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మొత్తం ఈ అల్లర్ల కేసులో 140 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.
ఐదేళ్ల పాటు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇప్పుడు పోలీసులు, ఎన్నికల కమిషన్ నిజాయితీగా పని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని పరిటాల సునీత విమర్శించారు. రామగిరి మండలం వెంకటాపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ కనుసన్నల్లో పోలీసులు బైండోవర్లు చేస్తున్నారని ఆరోపించడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు.
ఏడీసీసీ బ్యాంక్ సీఈఓగా సురేఖారాణి నియమితులయ్యారు. అవినీతి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రాజీనామా పత్రాన్ని అందజేసిన సీఈఓ ఏబీ రాంప్రసాద్ దీర్ఘకాలిక సెలవులకి వెళ్లారు. దీంతో ఏడీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ సురేఖారాణికి సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆప్కాబ్ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఏడీసీసీ బ్యాంకు సీఈఓగా సురేఖారాణి బాధ్యతలు స్వీకరించారు.
శ్రీసత్యసాయి జిల్లాలోని మహాత్మ జ్యోతిబా గురుకుల పాఠశాలలో మిగిలి ఉన్న 6,7,8,9 తరగతిలో ఉన్న ఖాళీలను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 20న జరిగే పరీక్షకు హాజరు కావాలని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అనంతపురంలోని జేఎన్టీయూలో నిర్వహిస్తున్నందున జేఎన్టీయూ నుంచి మూడు కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. శుక్రవారం జేఎన్టీయూను ప్రత్యేక పోలీసు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.