India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది. తాడిపత్రిలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో జేసీపై కేసులు నమోదు చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించగా జేసీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాలు చూపుతూ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
అనంత జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లోక్ సభ పరిధి, 8అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను వేరుగా లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాల కొస్తే ఒక్క తాడిపత్రి మాత్రమే 6 టేబుళ్లు, మిగతా స్థానాలకు 4 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అనంతపురం అర్బన్ 5 రౌండ్లు, రాప్తాడు 3, ఉరవకొండ, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గంలో 2 రౌండ్లు చొప్పున, తాడిపత్రి, రాయదుర్గం 1 రౌండ్లోనే లెక్కింపు పూర్తి కానుంది.
ధర్మవరంలో బుధవారం న్యాయవాది సంపత్ కుమార్ హత్యకు గురైన విషయం తెలిసిందే.. మృతుని స్నేహితునికి, మరో న్యాయవాది కృష్ణారెడ్డికి స్థల వివాదం ఉందని, స్నేహితుడికి మద్దతు తెలపడంతో హత్య చేశారని సంపత్ తండ్రి ఆరోపిస్తున్నారు. కాగా బుధవారం రాత్రి హంతకులు సంపత్‌ను హిందూపురంలో కారులో ఎత్తుకెళ్లి మార్గమధ్యలో కొడవలిలో నరికి చంపి.. ధర్మవరం చెరువు కట్టలో పడేసినట్లు సమాచారం. నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
కళ్యాణదుర్గం మండలంలోని హులికల్లు బీసీ కాలనీ సమీపంలో గురువారం
చిరుత సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటునుంచి వచ్చి దాడి చేస్తుందోనని పొలాలకు వెళ్లే రైతులు, కాలనీవాసులు బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. చిరుతను బంధించి అడవిలో వదలాలని కోరుతున్నారు. అటవీ అధికారి నాగే నాయక్ సిబ్బందితో రాత్రి గస్తీ నిర్వహించారు.
అనంత జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గం తొలి ఫలితానికి నాంది పలకనున్నట్లు తెలుస్తోంది. ఉరవకొండకు 18 టేబుళ్లను ఏర్పాటు చేయగా.. ఇక్కడ 15 రౌండ్లకే లెక్కింపు పూర్తవుతుంది. దీంతో తొలి ఫలితం విడుదల కానుంది. కళ్యాణదుర్గం 19, గుంతకల్లు, తాడిపత్రి 20, శింగనమల, అనంత, రాప్తాడు 21, రాయదుర్గం 22 రౌండ్లలో లెక్కించనున్నారు. కాగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానుండగా.. గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయా కౌంటింగ్ కేంద్రాలలో 14 టేబుల్ ఏర్పాటు చేశామని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం లేపాక్షిలో కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల్లోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు భారీ ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంల కౌంటింగ్ కోసం ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు.
గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరు మృతి చెందారు. బీటీపీ గ్రామానికి చెందిన వీరేశ్ పరిస్థితి విషమించడంతో రాయదుర్గం ప్రభుత్వాసుపత్రి నుంచి బళ్లారి విమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం రాత్రి మృతి చెందాడు. విద్యుత్ స్తంభాలతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో స్థంబాలు మీదపడి తీవ్రగాయాలవడంతో మృతిచెందినట్లు సమాచారం.
రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవ వేడుకలు గురువారం ముగిశాయని ఆలయ ఈవో నరసింహారెడ్డి మీడియాతో తెలిపారు. సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సప్త ప్రాకారోత్సవం కార్యక్రమం చేపట్టారు. అనంతరం శయనోత్సవం కార్యక్రమం చేపట్టారు. దీంతో బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయన్నారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన పట్టణ పుర ప్రజలకు, భక్తులకు ఆలయ ఈవో ధన్యవాదాలు తెలిపారు.
జూన్ 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని పోలీసు అధికారులతో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ సందర్భంగా గ్రామాల్లో ఇరు పార్టీలకు చెందినవారు శాంతియుతంగా ఉండాలని, హింసాత్మక ఘటనలకు దిగితే కఠిన చర్యలు తప్పవన్నారు.
బొమ్మనహల్ మండలం కొళగానహళ్లికి చెందిన ఓ యువ కూలీ పాము కాటుకు గురై మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. కొళగనహళ్లి గ్రామానికి చెందిన హెచ్.ప్రభాకర్ దేవిగిరి క్రాస్ వద్ద పశుగ్రాసం లారీ లోడింగ్ కోసం తోటి కూలీలతో కలిసి వెళ్లాడు. అక్కడ జొన్న పంటలో కాలికి పాము కాటు వేసింది. వెంటనే అతడిని బళ్లారి వీమ్స్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య సవిత ఉన్నారు.
Sorry, no posts matched your criteria.