India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐ సెట్ ఫలితాలు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఐ సెట్ ఫలితాలు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,447మంది ICETకు హాజరుకాగా.. 42,984మంది అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఈ ఐసెట్‌లో అనంతపురం జిల్లాకు చెందిన కడపన గణేశ్ కుమార్ రెడ్డి నాలుగో ర్యాంక్, దవనబోయన వెంకటేశ్ తొమ్మిదవ ర్యాంకు సాధించారు.
అంబులెన్స్ సిబ్బంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. అనంతపురం నగరానికి చెందిన ముస్తఫా ఆత్మకూరులో 104 అంబులెన్స్ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అందరితో కలిసి అంబులెన్స్‌లో పంపనూరు తాండాకు ఇవాళ వెళ్లారు. సిబ్బంది అక్కడ వైద్య సేవలు నిర్వహిస్తుండగా పక్కన ఉన్న ఖాళీ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పుట్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి క్రాస్ వద్ద బైక్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి రామలింగయ్యపల్లి గ్రామానికి చెందిన ధనాచారిగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు.
అనంతపురం దగ్గరలోని మారుతీ నగర్ ఫస్ట్ క్లాస్ వద్ద గురువారం రైలులో నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల మేరకు బెంగళూరు నుంచి బళ్లారి వెళ్లే హంపి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సురేశ్ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ఏపీ ఈసెట్ ఫలితాలు అనంతపురం జేఎన్టీయూలో గురువారం విడుదల చేశారు. బీటెక్ రెండవ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్ పరీక్ష అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. 37767 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 36369 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 32881 మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు. ఉత్తీర్ణతా శాతం 90.41గా ఉందన్నారు.
రొద్దం మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగు చూసింది. ఎస్సీ కాలనీ సమీపంలో చెట్టుకు చంద్ర మోహన్ అనే వ్యక్తి చీరతో మెడకు ఊరి వేసుకోని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ధర్మవరంలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించిన విషయం తెలిసిందే. హిందూపురం పట్టణానికి చెందిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శి, యువ న్యాయవాది సంపత్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ధర్మవరం ఒకటవ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సమీపంలోని ధర్మవరం చెరువు రెండవ మరువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం స్థానికులు సమాచారం అందించడంతో ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే ఆయన ఎవరు అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఓ ప్రిన్సిపల్‌కు కర్నూలు ఏసీబీ కోర్టు జైలు శిక్షతోపాటు బుధవారం జరిమానా విధించింది. అనంతపురం రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపిన మేరకు హిందూపురం ప్రభుత్వ అందుల రెసిడెన్షియల్ పాఠశాలలో 2017లో రాజేశ్వర్ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. పెన్షనరీ బెనిఫిట్స్ బిల్లుల కోసం ప్రిన్సిపల్ రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అనంతపురం జిల్లాలో చినుకులు పడితే చాలు ప్రజలు వజ్రకరూరు చేలలోకి పరుగులు తీస్తున్నారు. పొలాల్లో దొరికే రాళ్లు, వజ్రాలని అవి వారి తలరాతలు మారుస్తాయని అంటుంటారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబరు వరకు వేట సాగిస్తారు. స్థానికులతో పాటు కర్నూలు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు బళ్లారి నుంచి కూడా వస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఏటా 40 నుంచి 50 వజ్రాలు దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.