India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిందూపురం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నానని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. బీజేపీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి బీకే.పార్థసారథిని కూటమి ఖరారు చేసింది. ఆశించిన టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని పరిపూర్ణానంద నిర్ణయించుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నామినేషన్ వేస్తానంటున్నారు.
రంజాన్ మాసం సందర్భంగా కదిరిలో ముస్లిం మైనార్టీల కోసం ఏప్రిల్ 1న ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన వేదికను పరిశీలించేందుకు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సోమవారం కదిరికి విచ్చేశారు. కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్ అహ్మద్‌తో కలిసి కదిరి-మదనపల్లి రోడ్‌లోని పీవీఆర్ ఫంక్షన్ హాలును పరిశీలించారు.
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు రామిరెడ్డి మరణించిన సందర్భంగా.. ఈరోజు (మంగళవారం) ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.పుల్లారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని కోరారు.
కదిరి పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాల అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శేష వాహనంపై స్వామి వారిని ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగింపు చేశారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు పూజలు చెల్లించుకున్నారు.
రాయదుర్గంలోని మధుగులమ్మ దేవాలయం వద్ద ఓ సోమవారం సాయంత్రం చిన్నారిని గుర్తుతెలియని తల్లిదండ్రులు వదిలి వెళ్ళారు. పాప ఏడుపును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు దేవాలయం వద్దకు చేరుకొని రోడ్డుమీద ఏడుస్తున్న రెండు ఆ చిన్నారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం జిల్లాలో 5 ప్రాంతాలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన స్థానంలోని ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డి, వాతావరణ విభాగం శాస్త్రవేత్త నారాయణస్వామి సోమవారం తెలిపారు. శింగనమల 40.8, యాడికి 40.2, గుంతకల్ 40.1, బొమ్మనహల్ 40, శెట్టూరు 39.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వారు తెలిపారు.
నల్లమాడ మండలం కొట్టాలపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డిని కేవలం వ్యక్తిగత కారణాలతోనే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైందని డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ వాసుదేవన్ మాట్లాడుతూ.. హత్యలో ఎటువంటి రాజకీయ కోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే చంపి ఉండవచ్చన్నారు.
నల్లమాడ మండల పరిధిలోని కుటాలపల్లిలో టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని తోట వద్ద నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలో గుమ్మనూరు జయరామ్‌కు చోటు దక్కలేదు. గుంతకల్లు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు ఐవీఆర్ఎస్ సర్వేలో అనుకూలత లేదని సీటు నిరాకరించినట్లు సమాచారం. ఇప్పటికే గుంతకల్లులో పార్టీ కార్యాలయం స్థాపించి గుమ్మనూరు సోదరులు ప్రచారాలు సైతం నిర్వహించారు. అయితే అక్కడి స్థానిక నేతల నుంచి వ్యతిరేకత, ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా గుమ్మనూరుకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
రొళ్ల మండలం దొడ్డేరి పంచాయతీలో ANM, వైద్యుల నిర్లక్ష్యం పసికందు(నెల)ను బలి తీసుకుంది. పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్లు గ్రామానికి చెందిన రాధమ్మ, దొడ్డ హనుమ దంపతులకు జన్మించిన పసికందుకు ANM వరలక్ష్మి ఈనెల 23న 3 వ్యాక్సిన్‌లు వేశారు. అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున పసికందు మరణించింది. తమ బిడ్డ మరణానికి ANM, వైద్యులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.