India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లికి నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగరాజు ఐచర్ డ్రైవర్గా పనిచేసేవాడు. ఇటీవల నంద్యాలలో పెళ్లి సంబంధం కుదిరింది. కొన్ని కారణాలతో ఆ సంబంధం ఆగిపోయింది. దీంతో యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై తెల్లవారుజామున ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 26, 28వ తేదీన జరగాల్సిన ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం 25న నిర్వహిస్తున్నట్లు డీవీఈవో వెంకట నాయక్ తెలిపారు. 26న రసాయన శాస్త్రం, చరిత్ర 28న బాటనీ, జువాలజీ, కామర్స్ సబ్జెక్టుల మూల్యాంకనం జరగాల్సి ఉండగా ఆయా సబ్జెక్టులను 25నే నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధ్యాపకులు, అధికారులు హాజరుకావాలని కోరారు.
అనంతపురం జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 1,284 మద్యం కేసులు నమోదయ్యాయని అనంతపురం ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 1,272 మందిని అరెస్టు చేసి 206 వాహనాలు సీజ్ చేశామన్నారు. ఎన్నికల దృష్ట్యా జిల్లాలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి చెక్ పోస్టులో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారని వెల్లడించారు.
వైసీపీ నాయకుల మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నల్లమాడ మండలం దొన్నికోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్టపర్తి టీడీపీ, జనసేన, ఉమ్మడి అభ్యర్థికి పల్లె సిందూరకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు తండాలో మాజీ మంత్రి పరిటాల సునీత పర్యటించారు. లంబాడి మహిళల సంప్రదాయ దుస్తులతో ఎన్నికల ప్రచారం నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం మద్దెలచెరువు తండాకు చెందిన మహిళలు సునీతకు తమ సంప్రదాయ దుస్తులు అందజేసి కాసేపు పాటలు పాడారు.
బత్తలపల్లి మండలం కోడకండ్లకు చెందిన పూర్ణ వర్ధిని(17) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్ణ వర్ధిని మదనపల్లి MJR పాలిటెక్నిక్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. 3 నెలల క్రితం ఆరోగ్యం సరిగా లేదని చెప్పి కాలేజీ నుంచి ఇంటికి వచ్చి చికిత్స పొందుతోంది.
పొత్తులో భాగంగా ధర్మవరం MLA అభ్యర్థిగా BJP జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై నేడో రేపో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే సీటును TDP నుంచి పరిటాల శ్రీరాం, బీజేపీ నుంచి వరదాపురం సూరి ఆశించారు. వైసీపీ అభ్యర్థిగా మరోసారి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి బరిలో దిగుతున్నారు. సత్యకుమార్ అయితేనే కేతిరెడ్డిపై గెలవగలరని భావించి ఆయన్ను బరిలో దింపుతున్నట్లు సమాచారం.
కొత్తచెరువులో ఆదివారం తెల్లవారుజామున చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్ కలకలం రేపింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు గుర్తు తెలియని దుండగులు చలపతిని ఆయన ఇంటి నుంచి కారులో కిడ్నాప్ చేశారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ పుటేజ్ ఆధారంగా కిడ్నాప్ ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చలపతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
30న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుత్తికి రానున్నట్లు వైసీపీ గుత్తి పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా ఆదివారం తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి 30వ తేదీన గుత్తికి రానున్నారు. గుత్తిలో బస్సు యాత్ర ముగిసిన తర్వాత కడప జిల్లా పులివెందులకు తరలి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
శెట్టూరు మండలం కంబాలపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాలపల్లికి చెందిన గొల్ల తిమ్మయ్య (30) మృతి చెందగా, ప్రసాద్ గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారు బైక్పై కుందుర్పికి వెళ్లి వస్తుండగా ఎద్దుల బండిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల తిమ్మయ్య తల, పొట్ట భాగంలో బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.
Sorry, no posts matched your criteria.