India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వెల్డింగ్ పని చేస్తూ విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన కనేకల్లు మండలంలోని ఆదిగానిపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బడిగే శ్రీనివాసులు (55) సోమవారం మధ్యాహ్నం వ్యవసాయం పనిముట్లు వెల్డింగ్ పనిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.
14,15 శాతబ్దాల్లో విజయనగర రాజులు పెన్నఅహోబిలం ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్వామివారి పాదం కింద ఓ బిలం ఉంది. అభిషేకం చేసిన నీళ్లు ఈ బిలం గుండా వెళ్లి పెన్నా నదిలో కలుస్తాయి. అందువల్లనే ఈ క్షేత్రానికి పెన్నఅహోబిలం అనే పేరు వచ్చింది. ద్వాపరయుగంలో ఉద్ధాలక మహర్షి ఘోర తపస్సు చేయగా స్వామి ప్రసన్నుడై తన కుడి పాదం పెన్నఅహోబిలంపై ఎడమ కాలు అహోబిలంపై మోపినట్లు ఇక్కడి శాసనాలు, పురాణాలను బట్టి తెలుస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఫైర్ క్రాకర్ల తయారీ, అమ్మకం, కొనుగోలు, వినియోగం, రవాణాపై నిషేధం విధించినట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతల పరిరక్షణ శరీరంలో భాగంగా జూన్ 5వ తేదీ వరకు ఎక్కడ తయారీ, అమ్మకాలు, రవాణా జరగకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పుట్టపర్తి రూరల్ మండలం వీరచిన్నయ్యగారిపల్లికి చెందిన వడ్డే విష్ణువర్ధన్(19) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీకామ్ చదువుతున్నాడు. తన తండ్రి రాజేశ్ తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెంది ఉరివేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సోమవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి, డీఆర్ఓ కొండయ్యతో పాటు పలువురు అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథితో పాటు పలువురు అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు పాల్గొన్నారు.
ఎన్నికల పోలింగ్ తర్వాత ఉమ్మడి అనంత జిల్లాలో, ముఖ్యంగా తాడిపత్రిలో పెద్దఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి SPని మార్చి కొత్తగా గౌతమి శాలిని SPగా ఎన్నికల కమిషన్ నియమించింది. మేడమ్ అనంతలో అడుగుపెట్టగానే సీన్ మొత్తం మారిపోతోంది. గొడవలకు దిగేందుకు రాజకీయ నేతలు, రౌడీ షీటర్లు భయపడుతున్నారు. వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆయా పార్టీలకు వత్తాసు పలికిన అధికారులపై చర్యలకు పూనుకున్నారు.
మనం ప్రకృతిని సంరక్షించుకుంటే సంతోషకరమైన జీవితం పొంద వచ్చని సినీ ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం నార్పలకు వచ్చిన వారు.. ద్యానమందిర కేంద్రంలో ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ప్రతి ఒక్కరూ పొలం గట్లు, ఇళ్ల ముందు, రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పక్షులకు, మూగజీవాలకు ఆహారంతో పాటు నీరు అందించాలన్నారు.
అనంతపురం జిల్లాలో డెంగీ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 32 డెంగీ, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. పట్టణాల్లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించారు. అనంతపురం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, రాప్తాడు ప్రాంతాల్లో డెంగీ బాధితులను గుర్తించామన్నారు.
అనంతపురం జిల్లాలో ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన ఘటనలను ఎస్పీ గౌతమి శాలి సీరియస్‌గా పరిగణించారు. అల్లర్లకు పాల్పడిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. తాడిపత్రిలో 106 మంది, యాడికిలో 37 మంది, పెద్దవడుగూరులో ఏడుగురు, ఇతర ప్రాంతాల్లో 9 మంది కలిపి మొత్తం 159 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. అల్లర్లు, గొడవలు, ఘర్షణలకు దిగేవారికి ఇది పెద్ద గుణపాఠం అని హెచ్చరించారు.
పాలీసెట్ కౌన్సిలింగ్‌ను ఈ రోజు నుంచి నిర్వహించనున్నట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జయచంద్రా రెడ్డి తెలిపారు. నేడు 1 నుంచి 12,000 ర్యాంకు వరకు, 28న 12,001 నుంచి 27,000 వరకు, 29న 27,001 నుంచి 43,000 వరకు, 30న 43,001 నుంచి 59,000 ర్యాంకు వరకు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.