India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా బాస్కెట్ బాల్ బాలురు, బాలికల జట్లు విజయవాడలో ఈనెల 21 నుంచి 24 వరకు జరిగిన 7వ రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్ బాల్ పోటీలలో తృతీయ స్థానం సాధించారు. ఈ పోటీలలో బాలురు విభాగంలో అనంతపురం జట్టు.. విశాఖపట్నం జట్టుతో, బాలికల విభాగంలో అనంతపురం జట్టు.. పశ్చిమగోదావరి జిల్లా జట్టుతో కలిసి సంయుక్తంగా తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. అనంతపురం జిల్లా జట్టు సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.
మండల కేంద్రం కణేకల్లులో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. పట్టణంలోని దిగువ గేరి వద్ద ఉరవకొండ నుంచి కణేకల్లుకు వెళ్తన్న ఆర్టీసీ బస్సు యశ్వంత్ అనే బాలుడిని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బాలుడి కాలి పాద భాగం నుజ్జునుజ్జయ్యింది. గాయపడ్డ బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి ఆస్పత్రికి తరలించారు.
అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గౌతమి శాలిని ఆదివారం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలిశారు. తాడిపత్రి అల్లర్లకు సంబంధించి ఎస్పీతో చర్చించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి గానీ, అతని అనుచరులకు గానీ అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదని, వారిపై కేసులు పెట్టవద్దని ఎస్పీని కోరారు. వెంకట్రామిరెడ్డి కేవలం తనను పరామర్శించడానికి వచ్చారని వివరించారు.
గుత్తి మండలం ఎంగిలిబండ సమీపంలో ఆదివారం ఉదయం బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన రంజిత్ కుమార్(19) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తొండపాడుకు చెందిన రంజిత్ కుమార్, కళ్యాణ్, హరిబాబు బైక్‌లో గుత్తికి వెళ్తుండగా లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రంజిత్ కుమార్‌ను కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
నార్పల మండలం జంగమరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో రైతుల మధ్య ఘర్షణలో లక్ష్మీనారాయణ రెడ్డి మృతి చెందారు. అతడు ఇటీవల నూతన బోరు వేయించాడు. మోటార్ ఆమర్చడానికి వెళ్లిన సమయంలో తుంపెర గ్రామస్థులతో ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో కిందపడగా వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
అనంత జిల్లాలో 10వ తరగతి హిందీ సప్లిమెంటరీ పరీక్షకు 90శాతం మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షలు విభాగం ఏ.సి. గోవింద నాయక్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 45 సెంటర్లలో హిందీ పరీక్షకు 1680 మంది హాజరు కావాల్సి ఉండగా కేవలం 170 మంది మాత్రమే హాజరైనట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారిణి బి.వరలక్ష్మి తనిఖీ చేశారు.
అనంతపురం వ్యవసాయ మార్కెట్లో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.36 వేలు, కనిష్ఠంగా రూ.15వేలు, సరాసరి రూ.23 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అనంతపురం మార్కెట్‌కు శనివారం మొత్తంగా 525 టన్నుల చీనీకాయలు వచ్చాయని ఆమె వెల్లడించారు.
రొళ్ల మండల పరిధిలోని బంద్రేపల్లి గొల్లహట్టి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున శివన్న మేకల మంద పై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఒక మేక, రెండు పెంపుడు కుక్కలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. మేక మృతితో 8 వేలు నష్టం జరిగిందని ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
యాడికి మండలం కొనుప్పలపాడులో ఇరువర్గాల వారు రాళ్ల దాడికి పాల్పడ్డ కేసులో 24 మందిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య కర్రలతో ఒకరినొకరు కొట్టుకుని రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి 26 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు పరారీలో ఉండటంతో 24 మందిని అరెస్టు చేసి ఉరవకొండ కోర్టులో హాజరు పరచినట్లు సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.
అనంతపురం పట్టణంలోని రెండో రోడ్డు ఫ్లైఓవర్ కింద ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఆటోతో ఢీ కొట్టి వెంబడించి హత్య చేశారు. పోలీసులు తెలిపిన మేరకు శనివారం 11 గంటల తర్వాత రహమత్ నగర్‌కు చెందిన సుగాలి జైపాల్ నాయక్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఆటో తో ఢీ కొట్టి ప్రమాదానికి గురి చేశారు. అనంతరం సిమెంటు దిమ్మెను అతడి తలపై వేసి దారుణంగా హత్య చేశారు.
Sorry, no posts matched your criteria.