Anantapur

News May 26, 2024

అనంత జిల్లాలో ఓ విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3వ తరగతి నుంచి డిగ్రీ వరకూ శారీరక విభిన్న ప్రతిభావంతులైన బాలబాలికలు వసతి గృహాల్లో ఉండటానికి దరఖాస్తు చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎస్.అబ్దుల్ రసూల్ తెలిపారు. 100 బాలురకు, 50 మంది బాలికలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News May 26, 2024

అనంత: వేరుశనగ విత్తన కోసం 52,781 మంది రిజిస్ట్రేషన్

image

అనంతపురం జిల్లాలోని 29 మండలాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో 52,781 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. విత్తనకాయల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ప్రకారం 46,588 క్వింటాళ్లు అవసరం అవుతాయన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికి 37,889 క్వింటాళ్ల విత్తనకాయలను ఆయా రైతు భరోసా కేంద్రాల్లో నిల్వ ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే విత్తన పంపిణీ సైతం చేస్తున్నామని తెలిపారు.

News May 26, 2024

కౌంటింగ్ కోసం పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల కమీషన్ మార్గనిర్దేశకాల ప్రకారం సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్. వి ఆదేశించారు. శనివారం అనంతపురంలోని జేఎన్టీయూలో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు.

News May 25, 2024

అనంత: కుక్కపై చిరుత దాడి

image

గుత్తి మండలం కరిడికొండ గ్రామ సమీపంలో శనివారం చిరుత పులి కుక్కపై దాడి చేసింది. గ్రామస్థులందరూ కేకలు వేయడంతో గ్రామ సమీపంలోని కొండపైకి వెళ్లింది. జన సంచారంలోకి చిరుత పులి రావడంతో వారు భయాందోళనకు గురయ్యారు. కొండకు ఇరువైపులా నివాసాలు ఉండటంతో భయంతో వణికిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు చిరుత పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.

News May 25, 2024

INICETలో ధర్మవరం యువతికి ఆల్ ఇండియా 19వ ర్యాంకు

image

ధర్మవరం పట్టణానికి చెందిన అంబటి నైమిశా INICETలో ఆల్ ఇండియా 19వ ర్యాంకు సాధించారు. కర్నూలు పుల్లారెడ్డి డెంటల్ కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసింది. INICET పరీక్ష రాసి ఆల్ ఇండియా 19వ ర్యాంకు సాధించడంతో పలువురు ఆమెను అభినందించారు. నైమిశా మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ విజయం సాధించానని పేర్కొన్నారు.

News May 25, 2024

అనంత: వంకలో కొట్టుకెళుతున్న ఆవులను రక్షించిన స్థానికులు

image

విడపనకల్లు మండలం వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పాల్తూరు గ్రామం సమీపంలోని పెద్ద వంక ఉద్ధృతంగా ప్రవహించింది. వంకలో ఆవులు చిక్కుకుపోయి నీటిలో కొట్టుకుపోతుండగా అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే వాటిని కాపాడారు. మిగిలిన ఆవులు వరద తగ్గే వరకు బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాయి.

News May 25, 2024

సత్యసాయి జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం 43,988 మంది నమోదు

image

శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసే రైతులకు అందించే రాయితీ విత్తనాలకు 43,988 మంది పేర్లను నమోదు చేసుకున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు తెలిపారు. రైతులకు పంపిణీ చేసేందుకు విత్తనాలను ఆర్బీకేల్లో సిద్ధంగా ఉంచినట్టు పేర్కొన్నారు. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 43,988 మంది రైతులకు అనుగుణంగా 37,419 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని తెలిపారు.

News May 25, 2024

అనంత: మధుసూదన్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు

image

పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరుడు మధుసూదన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నెల 13న నల్లమాడ మండలంలోని నల్ల సింగయ్యగారి పల్లెలో మధుసూదన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలపై దాడికి ప్రయత్నించిన ఘటనలో అతడిపై కేసు నమోదైంది. ఎస్సై రమేశ్ బాబు మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా అతడు పరారీలో ఉన్నారు.

News May 25, 2024

అనంత: నాలుగు వరుసల రైల్వే లైన్ల నిర్మాణానికి కసరత్తు

image

రాష్ట్రంలోనే మొదటిసారి గుంతకల్లు రైల్వే డివిజన్‌లో 4 వరుసల రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇందుకోసం సర్వే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గుంతకల్లు నుంచి చెన్నై వైపు గుత్తి, తాడిపత్రి, కడప మీదుగా ఓబులవారిపల్లి వరకు 188.75 కి.మీ. పొడవుగా ప్రస్తుతమున్న రెండు వరుసల రైల్వేలైన్లకు తోడుగా మరో రెండు లైన్లు నిర్మించనున్నారు.3,4 వరుసల లైన్లను అందుబాటులోకి తేవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

News May 25, 2024

కౌంటింగ్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

image

సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై అనంతపురం జిల్లా అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ గౌతమి శాలి కలిసి జిల్లాలోని అధికారులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ రోజు చేపట్టాల్సిన అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.