India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైలు ఢీకొని విధ్యార్థి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల వివరాలు.. ఎన్పీకుంట మండలం వంకమద్దికి చెందిన పవన్(17) తిరుపతిలో ఇంటర్ పరీక్షలు రాసి 3రోజుల క్రితం తలుపుల(M) ఎగువపేటలోని మేనమామ ఇంటికి వచ్చాడు. బుధవారం కదిరికి వచ్చిన అతడు హెడ్ఫోన్ పెట్టుకుని రైల్వేపట్టాలపై నడుచుకుంటూ మాట్లాడుతుండగా రైలు ఢీకొంది. ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.
రాయదుర్గం రూరల్ మండల పరిధిలోని కొంతానపల్లిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ఇరు వర్గాల ఘర్షణలో 13మందిపై కేసు నమోదుచేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. పొలం విషయంలో కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారన్నారు. ఇరు వర్గాల దాడిలో పలువురు గాయపడ్డారు. పరస్పర ఫిర్యాదుల మేరకు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతపురం నగరంలోని పాతూరు మార్కెట్లో కూరగాయల ధరల వివరాలు… టమాటాలు (మేలు రకం) ₹20, రెండో రకం ₹10, మిరపకాయలు ₹50, ఉల్లిపాయలు (మేలు రకం) ₹25, రెండో రకం ₹15, ఆలుగడ్డలు ₹35, బీన్స్ ₹60, క్యారెట్ (మేలు రకం) ₹42, రెండో రకం ₹30, వంకాయలు ₹30, బెండకాయలు ₹40, ముల్లంగి ₹40, బీట్ రూట్ ₹40, బీరకాయలు ₹40, చౌళేకాయలు ₹40, కాకరకాయలు ₹40, క్యాబేజీ ₹40, మునక్కాయలు ₹60, నిమ్మకాయ (వంద) ₹350, అల్లం (కొత్తది) ₹140.
హిందూపురంలోని చౌడేశ్వరి కాలనీలోని ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయంలో బుధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ.. హిందూపురం పార్లమెంటు స్థానానికి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ అశ్వత్థ నారాయణరెడ్డి, నాగరాజు, ఆదినారాయణ శ్రీరాములు, ఆనంద్ పాల్గొన్నారు.
సింగనమల నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, ఈవీఎంల కమిషనింగ్, స్ట్రాంగ్ రూమ్ల కోసం ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో ఎన్నికల వేళ ఎక్కడైనా ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు ఆగడాలు, దౌర్జన్యాలు చేస్తున్నా, పాత పంథా కొనసాగిస్తున్నా, ఏదైనా హింస, అల్లర్లు, గొడవలకు పాల్పడుతున్నా వెంటనే తమకు ఈ నంబర్ ద్వారా 9440796800 సమాచారం పంపాలన్నారు. సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు.
డీ.హీరేహల్ మండలంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మండల పరిధిలోని రాయదుర్గం-బళ్ళారి ప్రధాన రహదారిపై మార్గమధ్యలో బళ్లారికి చెందిన మహమ్మద్ ఇషాక్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం సంబంధించింది. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని ఇద్దరు ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. పుట్టపర్తి రూరల్ మండలంలోని కంబాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రామాంజనేయులు, కదిరి పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని, వారిని సస్పెండ్ చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు.
అనంత :కేంద్ర ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు కోడ్ అమలు బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధిత రిటర్నింగ్ అధికారులదేనని జిల్లా ఎన్నికలు అధికారి కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రోడ్లకు ఇరువైపులా, బస్టాండ్ రైల్వే స్టేషన్ బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి రాజకీయ పరమైన హోర్డింగ్లు పోస్టర్స్ ఉన్న వెంటనే వాటిని తొలగించాలన్నారు.
గుమ్మగట్ట మండలం పూలుకుంట గ్రామం వాలంటీర్ హనుమంతు కర్ణాటక నుంచి 380 టెట్రా మద్యం ప్యాకెట్లు బైక్లో స్వగ్రామానికి తరలిస్తుండగా సరిహద్దు ప్రాంతంలో పట్టుకున్నట్టు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.9,800 నగదుతో పాటు బైక్, కర్ణాటక మద్యం సీజ్ చేసి అతడిని అరెస్టు చేశారు. అతడిని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు తెలిపారు .
Sorry, no posts matched your criteria.