India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య జరిగిన రాళ్లదాడికి సంబంధించి మరో 11మందిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. రాళ్లదాడిపై ఇప్పటికే సిట్ బృందం దర్యాప్తు చేసి అల్లర్లలో 728 మంది ప్రమేయం ఉందని నివేదికను అందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 91 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం మరో 11 మందిని అరెస్టు, 9మంది బైండోవర్ చేసినట్లు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని చోళసముద్రం, మలుగూరు కౌంటింగ్ కేంద్రాలలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. కేంద్ర బలగాలతో పాటు సుమారు 460 మంది సివిల్ పోలీసులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటిని మానిటరింగ్ రూమ్‌కు అనుసంధానం చేసి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
జిల్లాలో రానున్న 3, 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అనంతపురం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వేరుశనగ విత్తన పంపిణీ, భారీ వర్షాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులుంటే జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ 18004258803 (OR) 08554-239822కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. దీన్ని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఆకులేడు గ్రామానికి చెందిన రాజు గురువారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
తాడిపత్రి పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. డీఐజీ షిమోన్షి, ఎస్పీ గౌతమి శాలి పట్టణంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసాల వద్ద క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు. ఎన్నికల పోలింగ్ రోజు, తరువాత జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. వచ్చే నెల 4న వెలువడనున్న ఫలితాల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లికి చెందిన ఎం.శ్రీకాంత్ యాదవ్ సీఎన్‌ఏలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించారు. సందర్భంగా గురువారం వెస్ట్ బెంగాల్‌లో ఆ విద్యార్థికి 9 గోల్డ్ మెడల్స్, ఒక ప్లాటినం, ప్రైజ్ మనీతో సీఎన్ఏ సంస్థ ప్రతినిధులు ప్రదానం చేశారు. శ్రీకాంత్ కుటుంబంతో సహా వెళ్లి ఈ బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. పలువురు శ్రీకాంత్‌ను అభినందించారు.
అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలిని కలిసి వైసీపీ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాడిపత్రిలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని పోలీసులు వైసీపీ నాయకులపై బైండోవర్ కేసు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అంతటా ఇలా కేసులు నమోదు చేస్తున్నారని వెంటనే వాటిని ఆపించాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
శెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామ శివారులో పొలం పనులకు వెళుతున్న హనుమంతరాయుడు అనే రైతుపై ఓ ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. హనుమంతరాయుడు పొలంలోకి వెళుతున్న సమయంలో ఓ ఎలుగుబంటి అతడిపై దాడి చేసి కరిచింది. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన హనుమంతరాయుడును కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లాలో వేరుసెనగ విత్తనం కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 27,868 క్వింటాళ్లకు 31,555 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని డీఏవో ఉమామహేశ్వరమ్మ, ఏపీసీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 24, 520 క్వింటాళ్ల వేరుసెనగ విత్తనకాయలు ప్రాసెసింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.