India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బత్తలపల్లి సమీపంలోని నార్సింపల్లి రోడ్డు వద్ద సోమవారం పొలంలో విద్యుత్ తీగలు చోరీ చేయడానికి వచ్చి శ్రీరాములు(32) అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడని బత్తలపల్లి ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. బాధితుడు పుట్టపర్తి మండలం ఎనుములపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించమన్నారు. కుటుంబ సభ్యులతో గొడవపడి గత ఆరు నెలలుగా ఇంటికి వెళ్లడం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చెన్నై కొత్తపల్లి హైవేపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరు నుంచి అంబులెన్స్‌లో ఓ వ్యక్తి మృతదేహాన్ని తాడిపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి చెన్నై కొత్తపల్లి సమీపంలో ముందు వెళ్తున్న బస్సుని అంబులెన్స్ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ రాజు మన అనంతపురం ఎంపీగా పని చేశారని మీకు తెలుసా? ఇది నిజమే. హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనమైంది. ఆ తర్వాత నిజాం చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(6వ నిజాం) 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అలాగే 1962లో అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్.
అనంతపురంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమి తనిఖీ చేశారు. జిల్లా స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి ప్రాథమిక హైస్కూలులో సోమవారం కలెక్టర్ అరుణ్ బాబు పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను తనిఖీ చేశారు. సత్యసాయి జిల్లాలో మొదటి రోజు తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్డిఓ భాగ్యరేఖ, డిఇఓ మీనాక్షి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
శెట్టూరు మండలం ఐదుకల్లు అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందింది. వారం కిందట అనారోగ్యంతో మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు సోమవారం నిర్ధారించారు. వన్యప్రాణులకు తాగునీరు లేక మైదాన ప్రాంతంలోకి వచ్చి వ్యవసాయ పొలాల్లో నీళ్లు తాగి వెళ్తున్నాయని రైతులు చెప్తున్నారు. నీరు లేక చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చి దాహంతో అనారోగ్యానికి గురవుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు.
బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డుకు ఉన్న వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. నర్సింపల్లి రోడ్డు పక్కన ఉన్న వెంకటేశ్‌కు చెందిన వ్యవసాయ పొలంలో విద్యుత్ వైర్ల మరమ్మతుల కోసం ఓ వ్యక్తి స్తంభం ఎక్కాడు. విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. బత్తలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా.. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. సోమవారం అనంతపురంలోని మొదటి రోడ్‌లో ఉన్న శ్రీ శారదా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామ సమీపంలోని కొండ గుట్టల్లో సోమవారం ఓ చిరుత పులి మృతిచెందింది. స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత పులి అనారోగ్య కారణాలవల్ల మృతి చెందిందా?.. లేదా ఇతర కారణాలతో మృతి చెందిందా? తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు చిరుత పులి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
Sorry, no posts matched your criteria.