India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హిందూపురం బిట్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఐదో రౌండ్ ముగిసేసరికి హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 10, 935 ఓట్లతో ముందంజలో ఉన్నారు. హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీ.ఎన్. దీపికపైన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ముందంజలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి టి.ఎన్ దీపికపై 1880 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా ఉరవకొండ టీడీపీ పయ్యావుల కేశవ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై 272 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అనంతపురం జిల్లాలో 8 అసెంబ్లీ, అనంతపురం పార్లమెంట్ నుంచి 134మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో అనంతపురం పార్లమెంట్ నుంచి 21మంది, 8 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి 113మంది అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. జూన్ 4 జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఇప్పటికే అధికారులు కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. మరి కొన్ని గంటల్లో భవితవ్యం తెలనుంది.

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.38 వేలు, కనిష్ఠంగా రూ.15 వేలు, సరాసరి రూ.25 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. సోమవారం అనంతపురం మార్కెట్‌కు మొత్తంగా 720 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి తెలిపారు. మార్కెట్లో చీనీకాయలు గరిష్ఠంగా రూ. 38 వేలతో అమ్ముడు పోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

పాలిసెట్ అర్హత సాధించి కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు 7వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పాలిసెట్ కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ జయచంద్రారెడ్డి తెలిపారు. నేడు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌన్సెలింగ్ తేదీలను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈమేరకు 6న సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, 7న వెబ్ ఆప్షన్లు 13న సీట్ల కేటాయింపు, 14న సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రారంభమవుతాయని విద్యార్థులు గమనించాలని కోరారు.

అనంతపురం జిల్లాలోని 8అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 26,900 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. జిల్లావ్యాప్తంగా 20,18,162 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 9,97,792 మంది పురుషులు,10,20,124 మంది మహిళలు, 246 మంది ఇతరులు ఉండగా అందులో మొత్తం 16,36,648 మంది, 8,17,536 మంది పురుషులు, 8,19,004 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జిల్లా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. మండల కేంద్రాల్లోని తహసీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో 315 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. అక్కడి పరిస్థితులపై సమాచారం గంటకొకసారి జిల్లా కంట్రోల్ రూమ్ కు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని 280 ప్రాంతాలలో డ్రోన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అనంతపురం జిల్లాలో మంగళవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను అధికారులు ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఆర్ఓలు, తహశీల్దార్లు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడా లోపం రాకుండా పని చేయాలని తెలిపారు. సమస్య తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకరావాలని కోరారు.

మండల కేంద్రమైన నార్పల కొండ వంక ప్రాంతంలో నివాసం ఉంటున్న నారాయణస్వామి మనవడు రాజేశ్, గ్రామానికి సమీపంలో తోటలోకి సోమవారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడు రాజేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి అయిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దుఃఖంతో ఆవేదన చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.