India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 24వ తేదీన జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సత్యసాయి జిల్లా డీఆర్ఓ కొండయ్య పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు జరిగే పరీక్షలకు 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 28 మంది ఛీప్ సూపరింటెండెంట్లను నియమించడం జరిగిందన్నారు.
అనంతపురం జిల్లాలో మట్కా బీటర్‌పై జిల్లా బహిష్కరణ చేస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గార్లదిన్నె మండల కేంద్రానికి చెందిన దూదేకుల అబ్దుల్ మట్కా నిర్వహిస్తున్నారు. గార్లదిన్నె ఎస్ఐ మహమ్మద్ గౌస్ అదుపులోకి తీసుకుని జిల్లా బహిష్కరణ చేస్తున్నట్లు నోటీసులు అందించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
హిందూపురం పట్టణ సమీపంలోని బిట్ కళాశాలలో స్ట్రాంగ్ రూములను సత్యసాయి జిల్లా అధికారులు పరిశీలించారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, పెనుకొండ సబ్ కలెక్టర్‌తో పాటు పలువురు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మంగళవారం సాయంత్రం కళాశాలలోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రతను పర్యవేక్షించారు.
గుత్తి RWS డీఈఈ రాజ్ కుమార్ మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఈయన అనంతపురంలో నివసిస్తూ గుత్తిలో పనిచేస్తున్నారు. గత సోమవారం గుండెపోటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు నగరంలోని సవేరా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బంది సంతాపం ప్రకటించారు.
అనంతపురంలోని కలెక్టరేట్‌లో మంగళవారం విద్యాశాఖ అధికారులతో డీఆర్ఓ కొండయ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 10,461 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అనంతపురం జిల్లాలో 2 రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో రైతన్నలు పొలంలో సేద్యం చేసే పనిలో నిమగ్నమై దర్శనమిస్తున్నారు. అయితే పుట్లూరు మండలంలో మంగళవారం వానరాలు సైతం మేము కూడా పొలం దున్నేందుకు సిద్ధమంటూ ఏకంగా ట్రాక్టర్‌లో కూర్చుని రథసారథిగా మారి తన మిత్ర వానరాలను సైతం వెంటపెట్టుకుని వెళ్తున్నట్లుగా దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పార్లమెంటుకు 483మంది సిబ్బంది, 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 578 మంది మొత్తం 1,061 మంది అవసరం ఉంటుందని ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. పరిస్థితిని బట్టి ఈ సంఖ్య మరికొంత పెరగవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం ర్యాండమైజేషన్ అనంతరం సిబ్బందికి నియోజకవర్గాలు కేటాయిస్తారు.
అనంతపురం జిల్లాలో ఎక్కడైనా అక్రమ ఇసుక త్రవ్వకాలు జరిగితే ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇసుక అక్రమ త్రవ్వకాలు జరిగితే వెంటనే dmgoatpsandcomplaints@yahoo.com అనే మెయిల్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇసుక అక్రమ త్రవ్వకాలు జరిగితే ఫిర్యాదులు చేయవచ్చని, వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతపురం జిల్లాలోని ఐటిఐ అభ్యర్థులకు ఈనెల 23న ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామమూర్తి తెలిపారు. హోండా మోటార్, స్కూటర్ ఇండియా సంస్థలు ప్రాంగణ నియామకాలకు హాజరవుతాయన్నారు. ఐటిఐ చదువుతున్న, కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10గంటలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.
అనంతపురం జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 22,510 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 15,921మంది, ఒకేషనల్ విద్యార్థులు 980మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,017మంది, ఒకేషనల్ విద్యార్థులు 592 మంది ఉన్నారు. 34 కేంద్రాలకు గాను అనంతపురం నగరంలోనే 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆర్‌ఓ వెంకటరమణ తెలిపారు.
Sorry, no posts matched your criteria.