India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలోని 29 మండలాల్లో సబ్సిడీ వేరుశనగ కోసం సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో 10,205 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. విత్తన కాయల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 9,077 క్వింటాళ్ల వేరుశనగ అవసరమవుతుందని తెలిపారు. ఈ మేరకు రైతులకు సబ్సిడీపై వేరుశనగలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
అనంతపురంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నగరంలో గాలివానకు 40 చెట్లు విరిగిపడటంతో పాటు 30 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో నగరంలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు 75 శాతం ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు, ఉద్యోగులు చెట్లు, స్తంభాలు పడిపోయిన ప్రాంతాలను పరిశీలించి మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కౌంటింగ్ రోజు రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జూన్ 6 తేదీ వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉంటుందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే నిర్వహించాలన్నారు. 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్లో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ మేరకు వారితో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని పురాతన కట్టడాల ప్రాముఖ్యతను వెలుగులోనికి తీసుకురావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర పురావస్తు, ప్రదర్శనల శాలల శాఖ, ఇంటాక్ సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పాల్గొన్నారు.
బత్తలపల్లి మండలంలో పిడుగు పాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని ఉప్పర పల్లి సమీపంలో పిడుగు పడడంతో జింక చలపతి అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై 7 కేసులు నమోదు చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. అందులో 728మంది ముద్దాయిలు ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 396 మందిని గుర్తించగా 332మందిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 91మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురికి సీఆర్పీసీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
కదిరి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని డీఎస్పీ శ్రీలత పేర్కొన్నారు. ఈ యాక్ట్ ప్రకారం ప్రజలు, రాజకీయ పార్టీలు, ఏ ఇతర సంఘాలు ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉరవకొండ మండలం పాల్తూరు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో విడపనకల్ మండలానికి చెందిన మల్లికార్జునాచారి (65) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉండబండ నుంచి ఉరవకొండకు వెళ్తుండగా.. అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళ్తున్న కారు ఢీకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అమరాపురం మండలంలో అధిక వర్షపాతం నమోదైనట్టు జిల్లా అధికారులు పేర్కొన్నారు. అమరాపురం మండలంలో ఆదివారం రాత్రి 75.8 మిల్లీమీటర్లు, కనగానపల్లి లో 74.8, రామగిరి లో 36.4, గుడిబండలో 21.6, లేపాక్షిలో 19.2, ఆగలి మండలంలో 18.6 మిల్లీమీటర్ల పొందుతున్న జిల్లాలోని 18 మండలాల్లో 389.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అన్నారు.
ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లమెంటరీ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీవీఈవో రఘునాథరెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ అధికారిక వెబ్సైట్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.