India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తత్కాల్ కింద చెల్లించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ తెలిపారు. పరీక్ష ఫీజుతో పాటు తత్కాల్ కింద రూ. 3 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని, ఆయా ప్రిన్సిపల్ ను కలిసి ఫీజు చెల్లించాలని సూచించారు.
అనంతపురంలో ఈనెల 24 న ఉపాధ్యాయ విద్య ప్రవేశ పరీక్ష, (డీసెట్ ) నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మీ తెలిపారు. పట్టణంలోని ఎన్సీపీఎస్ఐ కేంద్రంలో పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు అందరూ కూడా విషయాన్ని గమనించాలని కోరారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో విషాదం అలుముకుంది. ఆదివారం ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇమామ్ బాషా (12) స్నేహితులలో కలిసి చిక్కవదియర్ చెరువులో ఈతకు వెళ్లి… ప్రమాదవ శాత్తు నీటి గుంటలో పడి మునిగిపోయాడు. పక్కనున్న పిల్లలు చుట్టుపక్కల వారికి సమాచారం అందించగా..వారు గాలించి బయటకు తీసి మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం పెట్రోల్ బంక్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోలు వేయకూడదని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌ను వాహనాలకు మాత్రమే సరఫరా చెయ్యలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు నిబంధనలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం పెట్రోల్ బంక్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోలు వేయకూడదని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌ను వాహనాలకు మాత్రమే సరఫరా చెయ్యలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు నిబంధనలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
అనంతపురంలో నివాసముంటున్న ఉపాధ్యాయుడు పూల రాంప్రసాద్, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె పూల దివ్యతేజ తెలంగాణ ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగంలో పదో ర్యాంకు సాధించింది. గుండె వైద్యురాలు కావాలన్నదే తన లక్ష్యమని దివ్యతేజ తెలిపింది. ఆమె విజయవాడలో చదువుకుంది. పదో తరగతిలో 587, ఇంటర్‌లో 984 మార్కులు సాధించింది.
అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని నియమించిన విషయం తెలిసిందే. ఆమె ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతం పెద్దకన్నలి గ్రామానికి చెందిన ఈమె.. ఇంజినీరింగ్ పూర్తి చేశారు. చెన్నైలోని కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగం చేశారు. అదే సమయంలోనే యూపీఎస్సీకి ప్రయత్నించి 2015లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఈమె కర్నూలు అదనపు ఎస్పీగా, అనకాపల్లి ఎస్పీగా పనిచేశారు.
హీరో శ్రీకాంత్ ఆదివారం అనంతపురం నగర పర్యటన వాయిదా పడింది. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎన్నికల నియమావళి, 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసుల అనుమతి లభించలేదు. ఈ కారణంగా శ్రీకాంత్ పర్యటన వాయిదా పడినట్లు ఆయన అనుచరులు తెలిపారు.
వజ్రకరూరు మండలంలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వజ్రాల అన్వేషణ ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందని ఆశతో వెతుకుతున్నారు. ఈ ఏడాది తొలకరి వర్షాలు ముందస్తుగా రావడంతో వజ్రాల వేట మొదలైంది.
గుంతకల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అబ్దుల్లా అనే ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని స్థానికులు గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.