Anantapur

News May 16, 2024

స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను పరిశీలించిన సత్యసాయి ఎస్పీ

image

హిందూపురం బిట్స్ కాలేజీ, లేపాక్షి వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతా ఏర్పాట్లను బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ఐపిఎస్ పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ…. స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రత కల్పించినట్లు తెలిపారు.

News May 15, 2024

శ్రీసత్యసాయి: ఎస్ఎల్‌ఏపీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

image

సోమందేపల్లి మండలంలోని పేటకుంట సమీపంలో ఉన్న కియా అనుబంధ సంస్థలో ఎస్ఎల్ఏపీ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాలతో అగ్నిప్రమాదం సంభవించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇద్దరు కార్మికులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

News May 15, 2024

కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు

image

తాడిపత్రిలో జరిగిన వైసీపీ-టీడీపీ దాడులపై ఇవాళ్ల రెండు కేసులు నమోదయ్యాయి. ఘర్షణలో గాయపడిన సీఐ మురళికృష్ణ ఫిర్యాదు మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి, సూర్యమునిలతో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. అలాగే రవితేజ ఫిర్యాదు మేరకు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభకార్ రెడ్డి, కాకర్ల రంగనాథ్, జగన్నాథ్, రంగనాయక్, జయచంద్రరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, యస్.రవీంద్రరెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదుచేశారు..

News May 15, 2024

శ్రీసత్యసాయి జిల్లాలో 144 సెక్షన్ విధింపు

image

శ్రీ సత్య సాయి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘర్షణలకు దారితీసే విధంగా ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

News May 15, 2024

జేసీ ప్రభాకర్ రెడ్డికి అస్వస్థత

image

తాడిపత్రిలో నిన్న జరిగిన వైసీపీ-టీడీపీ ఘర్షణ యుద్ధ వాతవరణాన్ని తలపించింది. ఈ ఘర్షణను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతున్నారు

News May 15, 2024

అనంత: YCPకి ఓటు వేసిందనే హత్య..?

image

కంబదూరు మండలం వైసీపల్లిలో మంగళవారం వెంకటేశ్ తన తల్లి సుంకమ్మను సుత్తితో కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. సుంకమ్మ వైసీపీకి ఓటు వేసిందనే వెంకటేశ్ ఆమెను హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. వెంకటేశ్ టీడీపీలో ఉన్నాడు. 13న తాను వైసీపీకి ఓటు వేసినట్లు వెంకటేశ్‌కు సుంకమ్మ చెప్పింది. ఆగ్రహంతో వెంకటేశ్ సుత్తితో కొట్టడంతో సుంకమ్మ మృతి చెందింది. పరారిలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News May 15, 2024

తాడిపత్రిలో పోలీసుల ఆపరేషన్ స్టార్ట్

image

తాడిపత్రిలో పోలీసులు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. పట్టణంలోకి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పక్కాగా ఆపరేషన్ స్టార్ట్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జేసీ ఇంటి నుంచి 30 మంది, ఎమ్మెల్యే ఇంటి నుంచి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి మండల వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్నారు

News May 15, 2024

అనంత: రికార్డ్ స్థాయిలో పోస్టల్ ఓటింగ్

image

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తాజా ఎన్నికల్లో 37,173 మంది ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు. 70 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయి ఓటింగ్ ఎప్పుడు జరగలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. 2019 ఎన్నికల్లో 27,516 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ స్థాయి ఓటింగ్ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అన్న చర్చ తీవ్ర ఆసక్తికరంగా మారింది. 

News May 15, 2024

అనంత: తల్లిని సుత్తితో కొట్టి చంపిన కొడుకు

image

కంబదూరు మండలం వైసీ పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి సుంకమ్మను కొడుకు వెంకటేశులు సుత్తితో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని సుంకమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 15, 2024

తాడిపత్రిలో యుద్ధ వాతావరణం.. భారీగా పోలీసు బలగాల మోహరింపు..!

image

తాడిపత్రిలో నిన్న 8 గంటల పాటు యుద్ధ వాతావరణం తలపించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి అనుచరులు రాళ్లతో దాడులు చేసుకున్నారు. విషయం తెలిసి పట్టణంలో డీఐజీ షిమోషీ వాజ్ పాయ్ పర్యటించారు. ఘర్షణలకు దారి తీసిన పరిస్థితులపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల కోసం మరిన్ని పోలీసు బలగాలను రప్పించారు. డీఐజీతో పాటు కర్నూలు డీఐజీ, ఎస్పీ, కడప, అన్నమయ్య, జిల్లాల ఎస్పీలు తాడిపత్రికి చేరుకున్నారు.