India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాళ్లదాడితో అట్టుడికిన తాడిపత్రి పట్టణంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది.. తాడిపత్రిలో దాదాపు 5 గంటలపాటు ఘర్షణ కొనసాగింది. అయితే ఈ ఘర్షణలో పోలీసు అధికారులతో పాటు పలువురు కార్యకర్తలు, నాయకులు సైతం గాయపడ్డారు. ప్రస్తుతం జూనియర్ కళాశాల మైదానం, జేసీ నివాసం, ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసాల ప్రాంతాలలో కేంద్ర బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, పోలీసులు పహారా కాస్తున్నాయి.
వజ్రకరూర్ మండలం తట్రకల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడి ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఉరవకొండ నుంచి గుంతకల్లుకు బండల లోడును ట్రాక్టర్‌లో వేసుకొని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాడిపత్రిలో జరుగుతున్న టీడీపీ-వైసీపీ దాడుల నేపథ్యంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు కేవలం గన్‌మెన్‌లను మాత్రమే అనుమతించినట్లు సమాచారం. పెద్దారెడ్డిని ఎక్కడికి తీసుకెళ్లారన్న సమాచారం పోలీసులు వెల్లడించలేదు.
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని యనమలపల్లిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి చెందాడు. ఎరికల గురుమూర్తి అనే టీడీపీ కార్యకర్తపై సమీప బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గురుమూర్తిని చికిత్స నిమిత్తం అనంతపురం తీసుకెళ్లగా అక్కడ మృతిచెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పుట్టపర్తి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
లేపాక్షి మండలం మానేపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ గోపీ తెలిపారు. దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి పడేశారని పేర్కొన్నారు. ఎక్కడో హత్యచేసి ఇక్కడ పడేశారా? లేక ఇక్కడే హత్య చేశారా? అనే కోణంలో విచారిస్తున్నామని చెప్పారు. హత్యచేసి దాదాపు పది రోజులై ఉంటుందని, మృతదేహం బాగా కుళ్లిపోయిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో దాదాపు రాత్రి 11.30 గంటల వరకు పోలింగ్ జరిగింది. జిల్లాలో అత్యధికంగా ధర్మవరం నియోజకవర్గంలో 88.61 శాతం, హిందూపురం నియోజకవర్గంలో 77.82 శాతం నమోదైంది. కదిరి 81.37, మడకశిర 79.20, పెనుకొండ 85.40, పుట్టపర్తి నియోజకవర్గంలో 84.11 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
అనంతపురం జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో అత్యధికంగా ఉరవకొండ నియోజకవర్గంలో 87.67శాతం, అనంతపురం అర్బన్‌లో 65.08 శాతం నమోదైంది. గుంతకల్లు 76.84, కళ్యాణదుర్గం 84.48, రాప్తాడు 84.50, రాయదుర్గం 78.98, శింగనమల 81.21, తాడిపత్రి 80.60 శాతం నమోదైంది. కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అనంతపురంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు చేరేవరకు అధికారులంతా సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్. వి ఆదేశించారు. సోమవారం రాత్రి నగరంలోని జేఎన్టీయూలో అనంతపురం అర్బన్, శింగనమల, రాప్తాడు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
అనంతపురం జిల్లాలో 9 గంటల సమయానికి పలుచోట్ల పోలింగ్ ముగియగా మరో పలుచోట్ల ఓటింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల పోలింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఓటింగ్ శాతం నియోజకవర్గాల వారిగా చూసుకుంటే రాయదుర్గం 77.6%, ఉరవకొండ 80.4%, గుంతకల్లు 71.56%, తాడిపత్రి 77.58%, శింగనమల 80.13%, అనంతపురం 64.5%, కళ్యాణదుర్గం 79.4%, రాప్తాడు 81.41 శాతంగా నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తెలిపారు.
ఓబులదేవరచెరువు మండలంలోని కుసుమ వారి పల్లిలో డీలర్ ఇంద్రప్పపై కత్తితో దాడి జరిగింది. సోమవారం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీకి చెందిన డీలర్ ఇంద్రప్పపై ఈశ్వరయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగా దాడి జరిగినట్టు సమాచారం.
Sorry, no posts matched your criteria.