India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంత జిల్లాలో జరిగే ఎన్నికలకు 3,940 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన సివిల్ 1,400 మంది, ఏఆర్ 420, హోంగార్డులు 438 విధుల్లో పాల్గొంటారని ఎస్పీ తెలిపారు. సీఆర్పీఎఫ్ 85 మంది, బీఎస్ఎఫ్ A380, నాగాలాండ్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసులు 420 మందితో పాటు కర్ణాటక సివిల్ పోలీసులు 200 మంది, కర్ణాటక హోంగార్డులు 440 మందిని నియమించారు.
13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ మాధవ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో అల్లర్లు సృష్టించడానికి వంద మంది బయటి వ్యక్తులు నగరానికి వచ్చినట్లు జనసేన నేత జయరామిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు డీఎస్పీ టీవీవీ ప్రతాప్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అల్లుడు వారిని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన డీఎస్పీ.. తాము నగరంలో సోదాలు జరుపుతామని జయరామిరెడ్డికి హామీ ఇచ్చారు.
ముదిగుబ్బ మండలంలోని జొన్నలకొత్తపల్లి, రాళ్ల అనంతపురం మధ్య చెన్నై జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఉప్పలపాడుకు చెందిన రఫీ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనంతలో పోలింగ్ నిర్వహణకు 15,776 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో ప్రిసైడింగ్ అధికారులు (పీఓ) 2,472 మంది, సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓ) 2,552 మందిని నియమించారు. ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓ) 10,208 మందిని వినియోగించనున్నారు. వీరు కాకుండా 544 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన 1,032 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు.
అనంతపురం జేఎన్టీయూ కళాశాలలో శుక్రవారం ఎన్నికల సెక్టోరియల్, పోలీస్ అధికారులు, అసెంబ్లీ స్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పారదర్శకంగా పని చేయాలని కోరారు. పోలింగ్ సిబ్బంది నిబంధనలకు లోబడి పని చేయాలని అన్నారు.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం మరొ కొన్ని గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా నిత్యం వార్తల్లో నిలిచింది. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. దీంతో కొన్ని చోట్ల డబ్బులతో ఓటర్లను ప్రభాలకు తెరలేసింది.
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన బీటెక్ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్, బీ ఫార్మసీ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు ఆచార్య కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. బీటెక్‌లో 14,263 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 13,344 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. బీ ఫార్మసీలో 2,492 మందికి గానూ 1,958 మంది పాసయ్యారని వెల్లడించారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 101.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా ఉరవకొండలో 23.6 మి.మీటర్లు, యాడికి 18.4, రాయదుర్గం 16.2, విడపనకల్లు 15.2, బెలుగుప్ప 13.6, కళ్యాణదుర్గం 11.6, గుమ్మగట్ట 4.8, కంబదూరు 4.6, కనేకల్ 2.0, పెద్దపప్పూరు 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అనంతపురం రూరల్ మండలంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు గురువారం ఉపకులపతి హుస్సేన్ రెడ్డి విడుదల చేశారు. బీఏలో 159 మందికి గాను 104 మంది ఉత్తీర్ణులయ్యారు. బీకాంలో 22 మందికి గాను 13 మంది, బీబీఏ, బీకాం కంప్యూటర్స్‌లో 150 మందికి గాను 98 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
Sorry, no posts matched your criteria.