India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంత జిల్లా కంబదూరు మండలంలోని కదిరిదేవరపల్లిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అచ్చంపల్లికి చెందిన వాలంటీర్ ఉప్పర తిమ్మరాజు(26) మృతిచెందాడు. కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన టాటా సుమో ఢీకొంది. ప్రమాదంలో తిమ్మరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల నేపథ్యంలో అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 12, 13వ తేదీల్లో నిర్వహించే సంతలు బంద్ చేస్తున్నట్లు యార్డు అధికారి జయలక్ష్మి తెలిపారు. ఈ నెల 12న ఆదివారం పశువుల సంత, 13న చీనీ సంతలు నిర్వహించడం లేదని వెల్లడించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు, రైతులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
మే 12, 13వ తేదీల్లో పత్రిక ప్రకటనలపై అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. పోలింగ్‌కు ముందు రోజు పత్రికలలో వేసే ప్రకటనలకు పోటీచేసే అభ్యర్థులు రెండు రోజులు ముందుగా ఎంసీఎంసీ ధ్రువీకరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అలాగే పత్రిక యాజమాన్యాలు కూడా ఎంసీఎంసీ ధ్రువీకరణ ముందస్తు అనుమతి లేకుండా రాజకీయ పార్టీల ప్రకటనలు ప్రచురించరాదన్నారు.
సీఎం జగన్ కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. కళ్యాణదుర్గం సిద్ధమా? అని ప్రజలను పలకరించగానే కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ‘మధ్యాహ్నం 2 గంటలు కావొస్తోంది. ఎండలు చూస్తే తీవ్రంగా ఉన్నాయి. అయినా ఏ ఒక్కరూ ఖాతరు చేయలేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలను పంచిపెడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు, నా ప్రతి సోదరుడికి రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నా’అని జగన్ అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలోని అల్లూడిలో గురువారం విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. కందపల్లి గ్రామానికి చెందిన శీనప్ప విద్యుత్ మరమ్మతులు చేయడానికి స్తంభం ఎక్కగా షాక్‌కు గురయ్యాడు. లైన్‌మెన్ ఆపరేటర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కళ్యాణదుర్గం రానున్నారు. ముందుగా కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సభాస్థలికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం రాజంపేట బయలుదేరి వెళ్తారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్ఓ కార్యాలయం ముందు స్వతంత్ర అభ్యర్థి నాగరాజు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన చెందారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని ఎన్నికలు రిటర్నింగ్ అధికారి హామీ ఇవ్వడంతో అర్ధనగ్న ప్రదర్శన విరమించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో సినీ హీరో నారా రోహిత్ పర్యటించనున్నట్లు మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. రొళ్ల మండల కేంద్రంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి ఎంఎస్ రాజు, ఎంపీ అభ్యర్థి పార్థసారథికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు.
అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా షేమషిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం సాయంత్రంలోగా అనంతపురంలో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా షేమషిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం సాయంత్రంలోగా అనంతపురంలో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.