India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 13న ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. 11వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి నుంచి 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జూన్ 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా దుకాణాలను మూసి ఉంచాలని పేర్కొన్నారు.
సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. కర్నూలులో గురువారం మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1గంటకు కళ్యాణదుర్గానికి చేరుకుంటారు. 1.10కి హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ స్థలికి చేరుకుంటారు. 1.30 నుంచి 2.15 వరకు బహిరంగసభ, అనంతరం 2.30కు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వెళ్లనున్నారు.
రానున్న రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. వచ్చే 5 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 41.6 నుంచి 43.7 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 28.6 నుంచి 29.7 డిగ్రీలుగా నమోదయ్యే సూచన ఉందన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఓటు హక్కు ప్రాధాన్యతను వినూత్న రీతిలో వ్యక్తపరిచారు. తన ఇంటి ముందు గోడకు ‘ఓటుకు ఎలాంటి కానుకలు తీసుకోబడవు. భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం’ అంటూ జిరాక్స్ పేపర్లు అంటించారు. పట్టణంలోని బుగ్గయ్య కాంపౌండ్ వీధికి చెందిన ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి దూదేకుల షాషావలి ఈ వినూత్న ప్రచారానికి తెరతీశారు.
జిల్లాల పునర్విభజనలో భాగంగా రాప్తాడు సెగ్మెంట్ 2 జిల్లాల్లో విస్తరించింది. అనంతపురం(పాక్షికం), ఆత్మకూరు, రాప్తాడు అనంత జిల్లాలో, కనగానపల్లి, C.కొత్తపల్లి, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా రాప్తాడు అసెంబ్లీ స్థానం 2009లో ఏర్పడింది. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పరిటాల సునీత గెలుపొందగా.. 2019లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విజయం సాధించారు.
ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం ఐటీఐ ప్రిన్సిపల్ రామమూర్తి తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఐటీఐ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు లభించడానికి అధిక అవకాశాలు ఉన్నాయన్నారు.
సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై అనంతపురం కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రత్యేక పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా, అమిత్ కుమార్ సింగ్, అజయ నాథ్, పోలీసు పరిశీలకులు రవికుమార్ హాజరయ్యారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు.
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గులపాళ్యం గ్రామ సమీపంలోని నీటి గుంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
రొళ్ల మండలంలోని పిల్లిగుండ్ల చెక్ పోస్ట్‌లో డ్యూటీల విషయంలో గొడవ పడిన కానిస్టేబుల్స్ శివ, నారాయణస్వామిని వీఆర్‌కు పంపుతూ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్స్ డ్యూటీలో విషయంలో గొడవపడి విషయం బహిర్గతం కావడంతో వారిని వీఆర్‌కు పంపారు. సంఘటనపై విచారణ అనంతరం పోలీస్ శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
ఈనెల 9న సీఎం జగన్ కళ్యాణదుర్గానికి రానున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య తెలిపారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం కళ్యాణదుర్గంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని వెల్లడించారు. కావున నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.