India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ రాష్ట్ర కమిటీలో అనంతపురం జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం కల్పిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం అర్బన్ నియోజక వర్గం నుంచి రాష్ట్ర కార్యదర్శిగా రాయల్ మురళీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొండవీటి భావన, కళ్యాణదుర్గం నుంచి తెలుగు యువత కార్యదర్శిగా అనిల్ చౌదరికి అవకాశం కల్పించారు.
అనంతపురం జిల్లాలో ఓ పౌరుడు ‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు అంటూ’ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన స్టిక్కర్ వైరల్ అవుతోంది. గుత్తి పట్టణానికి చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద ఇచ్చట ఓట్లు అమ్మబడవు అంటూ స్టిక్కర్స్ అందరినీ ఆకర్షిస్తోంది.
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డుకు చెందిన నళిని అనే మహిళా వాలంటీర్‌పై సోమవారం కొందరు దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులు నళిని ఇంటి వద్దకు వచ్చి దాడి చేశారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం అర్బన్ నూతన డీఎస్పీగా టి.వి.వి ప్రతాప్ కుమార్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 8 గంటల లోపు అనంతపురంలో విధుల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషనర్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటువేసింది. ఆయనను తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. అమ్మిరెడ్డికి ఎలాంటి ఎన్నికలు విధులు అప్పగించొద్దని ఈసీ ఆదేశించింది.
అనంతపురంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి నిర్వహించే ఆర్డీటీ సెట్ ప్రవేశ పరీక్షకు 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మోహన్‌మురళీ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఆర్డీటీ సెట్ పరీక్షకు అర్హులన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసుల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
ధర్మవరంలోని బాలుర కళాశాల మైదానంలో ఓ గుర్తుతెలియని శవం కలకలం రేపింది. సోమవారం మైదానానికి వెళ్లిన క్రీడాకారులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శవం వద్దకు వెళ్లి పరిశీలించగా ఒక వృద్ధుడి మృతదేహంగా గుర్తించారు. ఇంతవరకు మృతుడి ఆచూకీ వివరాలు తెలియలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తచెరువు మండలంలోని ఓ దివ్యాంగురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్టు ఆదివారం మహిళ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానసిక దివ్యాంగురాలిపై గుర్తు తెలియని వారు అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేశ్ తెలిపారు.
ఉమ్మడి అనంతలో ఆదివారం గుంతకల్లులో అత్యధికంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, పరిగిలో 43.2 నంబులపూటకుంట , ధర్మవరం 43.0 డిగ్రీలు, తలుపుల, పెద్దవడుగూరు 42.8, పుట్టపర్తి 42.4, కదిరి, ఉరవకొండ 42.3, పామిడి 42.2, ముదిగుబ్బ 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
అనంతలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మూడో రోజు ఆదివారం నాటికి 7588 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. రాయదుర్గం 480, ఉరవకొండ 647, గుంతకల్లు 988, తాడిపత్రి 927, శింగనమల 563, అనంతపురం 1846, కళ్యాణదుర్గం 694, రాప్తాడు 1191, ఇతర జిల్లాల వారు 252 మంది ఇప్పటివరకు వినియోగించుకున్నారు.
Sorry, no posts matched your criteria.