Anantapur

News May 6, 2024

హిందూపురంలో నేటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

image

హిందూపురంలో MLA బాలకృష్ణ సోమవారం నుంచి 2 రోజులపాటు పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నట్లు పట్టణ అధ్యక్షుడు డీఈ రమేశ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఉదయం కొల్లకుంట, ఇందిరమ్మకాలనీ, కొట్నూరు, చౌడేశ్వరికాలనీ, ఆర్టీసీ కాలనీ, శాంతిగర్‌, త్యాగరాజనగర్‌, ఆబాద్‌పేట్‌, ముక్కడిపేట, ధర్మపురంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం మోతుకపల్లి, పరిగిరోడ్‌, బాపూజీనగర్‌, హస్నీబాద్‌ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించనున్నారు.

News May 6, 2024

ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు వేసేలా చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఈనెల 7న ఓపీఓలకు, 8వ తేదీన అత్యవసర సర్వీసులకు అవకాశాన్ని ఇస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, ఓటు కోసం దరఖాస్తు చేసుకోని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్‌కు తీసుకెళ్లి ఓటు పొందవచ్చునన్నారు.

News May 5, 2024

రైతులను అన్నివిధాల ఆదుకుంటాం: చంద్రబాబు

image

టీడీపీ అధికారంలోకి వస్తే రైతులను అన్నివిధాల ఆదుకుంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. అనంతపురం పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… వైసీపీ రైతుల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకుంటామని మోసం చేసిందన్నారు. సబ్సిడీ పరికరాలు ఇవ్వలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటామన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఆభ్యర్థులను గెలిపించాలని కోరారు.

News May 5, 2024

షా నోట సత్యకుమార్‌ పేరు.. కార్యకర్తల హర్షం

image

ధర్మవరం ప్రజాగళం సభలో అమిత్ షా ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. ఆయన ప్రసంగాన్ని ధర్మవరం MLA అభ్యర్థి సత్యకుమార్ తెలుగులో వినిపించారు. ‘సత్యకుమార్ నాకు చాలా ఆప్తుడు. ఆయనను గెలిపించాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నా’ అని షా అనగానే బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు చప్పట్లతో సత్యకుమార్‌కు మద్దతు తెలిపారు. తెలుగులో ప్రసంగించలేనందుకు మన్నించాలని చివరలో అమిత్ షా కోరడం విశేషం.

News May 5, 2024

అనంతపురం DSP వీర రాఘవరెడ్డి బదిలీ

image

అనంతపురం పట్టణ డీఎస్పీ వీర రాఘవరెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ టీడీపీలో కీలక నేతలపై ఆయన ఇటీవల కేసు నమోదు చేయించారనే ఆరోపణలపై టీడీపీ వరుసగా ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ మేరకు డీఎస్పీని బదిలీ చేస్తూ ఈసీ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది.

News May 5, 2024

గార్లదిన్నె: కుక్కు ఆపరేషన్ చేసి కాపాడారు

image

గార్లదిన్నె మండల కేంద్రంలో ఓ వీధి కుక్క ప్రసవించలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దానిని స్థానికులు గుర్తించారు. తక్షణమే అనంతపురం పశువైద్యశాలకు తరలించారు. డాక్టర్ పద్మనాభం ఆపరేషన్ చేసి గర్భంలో చనిపోయిన 5 కుక్క పిల్లలను బయటకు తీసి దాని ప్రాణాలు కాపాడారు.

News May 5, 2024

మడకశిరలో కాంగ్రెస్ గట్టిపోటీ.. త్రిముఖ పోరులో నెగ్గేదెవరో?

image

జిల్లాలో ఎక్కడా లేనట్లు మడకశిర నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ నుంచి ఎంఎస్ రాజు, వైసీపీ నుంచి ఈర లక్కప్ప బరిలో బరిలో ఉండగా.. వీరికి కాంగ్రెస్‌ అభ్యర్థి సుధాకర్ గట్టిపోటీ ఇచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మంచి పట్టున్న మాజీమంత్రి రఘువీరారెడ్డి విస్తృతంగా ప్రచారం చేయడం ఆ పార్టీకి ప్లస్‌గా మారింది. చూడాలి ‘మడకశిర’ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు నెగ్గుతారో?

News May 5, 2024

నేడు ధర్మవరానికి అమిత్ షా, చంద్రబాబు

image

కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌కు మద్దతుగా ధర్మవరంలో నిర్వహించే బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా, చంద్రబాబు ఆదివారం పాల్గొననున్నారు. ఈ సభకు కూటమి నేతలు, ప్రజలు భారీగా తరలివచ్చి ధర్మవరం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సత్యకుమార్ పిలుపునిచ్చారు. అటు జాతీయస్థాయిలో మంచిపేరున్న సత్యకుమార్ గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, దేశవ్యాప్తంగా ధర్మవరం పేరు మారుమోగుతుందని బీజేపీ నేతలు తెలిపారు.

News May 4, 2024

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన హిందూపురం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు

image

హిందూపురం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బాలాజీ మనోహర్ శనివారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. సిధ్ధం సభ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బాలాజీ మనోహర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలని, భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.

News May 4, 2024

అనంత: ఎన్నికల శిక్షణ కోసం వెళ్లి.. టీచర్ మృతి

image

తాడిపత్రి సమీపంలోని శివాలయం వద్ద రామాంజనేయులు అనే ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఉదయం 5 గంటల సమయంలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బొమ్మనహల్ మండలం చంద్రగిరిలో విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు ఎన్నికల శిక్షణ కోసం తాడిపత్రికి వెళ్లినట్లు సమాచారం. మృతి చెందిన విషయం ఉరవకొండలో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. వడదెబ్బకు గురై చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.