India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నియోజవర్గ కేంద్రంలోని ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. 4, 6 తేదీలలో జిల్లాలో నిర్వహించే పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 4, 6 తేదీల్లో పీఓ, ఏపీఓలకు ఆయా నియోజకవర్గాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామన్నారు. ఓపీఓలకు ఏడో తేదీ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ పారదర్శకంగా నిర్వహించామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్‌తో కలిసి ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీల ప్రతినిధుల సమక్షంలో సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం జౌకల గ్రామంలో ఓ వ్యక్తిని దారుణ హత్య చేసిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నాగభూషణం(38) అనే వ్యక్తిని దుండగులు అతి దారుణంగా దాడిచేసి హత్య చేశారు. శనివారం ఉదయం గ్రామ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కదిరి పోలీసులు తెలిపారు.
పాలిటెక్నిక్ డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్-2024 పరీక్షకు 37,767 దరఖాస్తులు వచ్చాయని అనంతపురం జేఎన్టీయూకు చెందిన ఈసెట్ ఛైర్మన్ ఆచార్య శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ మే 2న ముగిసిందన్నారు. ఈ నెల 8న ఈసెట్ పరీక్ష జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో 2 కేంద్రాలు, ఏపీలో 98 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
సీఎం జగన్ ఇవాళ హిందూపురంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్‌లో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు హిందూపురం టీడీపీ కంచుకోటగా మారింది. ఈ ఎన్నికల నేపథ్యంలో జగన్ పర్యటన హిందూపురంలో ఏ మాత్రం ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,211 ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని హిందూపురం, కదిరి, ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి, మడకశిర నియోజకవర్గాల నుంచి సివిల్ సప్లై, హోంగార్డ్, పోలీస్, రైల్వే, ఆర్టీసీ, వైద్యం, సెబ్, పౌర సంబంధాల శాఖ, విద్యుత్, ఆర్టీవో, ప్రెస్, అగ్నిమాపక శాఖల నుంచి 1,211 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
అనంతపురం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ అమిత్ బర్దర్‌తో కలసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. కంట్రోల్ సెంటర్‌లో నమోదయ్యే వివరాలను సేకరించారు. సిబ్బందితో మాట్లాడి అక్కడ ఎదురయ్యే సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సాధారణ ఎన్నికల సమయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు, సెబ్ అధికారులు, పోలీసు అధికారులు చిత్తశుద్ధితో సమర్థవంతంగా పనిచేయాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్. వి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లో ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు, డిపో మేనేజర్, రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ లతో కలసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. విజయవాడ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 10.10 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:35 గంటలకు హిందూపురంలోని ఎంజీఎం మైదానానికి హెలికాప్టర్‌లో వస్తారు. అక్కడి నుంచి బహిరంగ సభకు చేరుకుంటారు. సభ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో 1,025 మంది ఓటర్లు హోం ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 499 మంది, వికలాంగులు 526 మంది ఈనెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అర్హులైన వారు హోం ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.