Anantapur

News May 3, 2024

ఈనెల 5న ధర్మవరానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక

image

ఈనెల 5న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మవరానికి రానున్నట్టు బీజేపీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 5వ తేదీ ఉదయం 9: 45 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా 10:30 గంటలకు ధర్మవరం చేరుకుంటారు. ధర్మవరంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 1.30 గంటలకు తిరిగి బెంగళూరుకు వెళ్తారు.

News May 3, 2024

అనంత జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ కోసం 23,532మంది దరఖాస్తు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం 23,532మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్ కుమార్ వెల్లడించారు. నిర్దేశించిన తేదీల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు నియోజక వర్గానికి రెండు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News May 3, 2024

గుంతకల్: మద్యం మత్తులో తమ్ముడిని చంపిన అన్న

image

గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని సొంత అన్న నారాయణరెడ్డి కట్టెతో దాడి చేసి హత్య చేశాడు. గురువారం రాత్రి అర్ధరాత్రి నిద్రలో ఉన్న రామకృష్ణారెడ్డిపై మద్యం మత్తులో నారాయణరెడ్డి దాడి చేసి చంపాడు. గుంతకల్లు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News May 3, 2024

ఎన్నికల రోజు చిన్న సమస్యకు కూడా తావు లేకుండా చూడండి: ఎస్పీ

image

బుక్కరాయసముద్రం మండలంలో అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ గురువారం పర్యటించారు. మండల పరిధిలోని వెంకటాపురం, చెన్నంపల్లి, అగ్రహారం, బుక్కరాయసముద్రంలోని సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ రోజు బారికేడ్లు, తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రామాలలో పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రాణాళికా బద్ధంగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచనలు, సలహాలు అందజేశారు.

News May 2, 2024

చదరంగంలో గుంతకల్లు విద్యార్థి అంతర్జాతీయ రేటింగ్

image

గుంతకల్లకు చెందిన విద్యార్థి యువరాజ్ కార్వా చదరంగంలో ఇంటర్నేషనల్ రాపిడ్ రేటింగ్ 1,418 సాధించాడు. బెంగుళూరు మరియు గోవాలో జరిగిన 5వ ఐసీఏ, సెకండ్ యూనిటీ క్లబ్, ఆల్ ఇండియా రాపిడ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లలో పాయింట్స్ గెలిచి ఈ రేటింగ్ సాధించాడు. తండ్రి వినోద్ కార్వా వద్ద చదరంగంలో శిక్షణ పొంది ఈ ఘనత సాధించాడు. యువరాజ్‌ను పలువురు అభినందించారు.

News May 2, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోనీ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం పుట్టపర్తి మండలంలోని నిడిమామిడి, రాచువారి పల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయా గ్రామాలలో గత ఎన్నికలలో తలెత్తిన ఘటనలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా గొడవలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా వేయాలని సిబ్బందిని ఆదేశించారు.

News May 2, 2024

అనంత: నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడి మృతి 

image

గుంతకల్లు పట్టణ శివారు ప్రాంతంలోని బెస్ట్ కాలనీకి చెందిన జిశాంత్(4) నీటి సంపులో పడి మృతిచెందాడు. అక్క ఆయేషాతో కలిసి ఇంటిముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న తండ్రి మహబూబ్ అక్కడికి వెళ్లి సంపులో పడి ఉన్న బాలుడిని బయటకు తీయగా.. బాలుడు అప్పటికే మృతిచెందాడు.

News May 2, 2024

అనంత: నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడి మృతి 

image

గుంతకల్లు పట్టణ శివారు ప్రాంతంలోని బెస్ట్ కాలనీకి చెందిన జిశాంత్(4) నీటి సంపులో పడి మృతిచెందాడు. అక్క ఆయేషాతో కలిసి ఇంటిముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న తండ్రి మహబూబ్ అక్కడికి వెళ్లి సంపులో పడి ఉన్న బాలుడిని బయటకు తీయగా.. బాలుడు అప్పటికే మృతిచెందాడు.

News May 2, 2024

పుట్టపర్తి మండలంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం

image

పుట్టపర్తి మండలంలోని ఇరగరాజుపల్లి వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. గురువారం ఉదయం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రంగనాథ్ టీడీపీలోకి వెళుతున్నారనే సమాచారంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆయనను గ్రామం వెలుపలకు పిలిచారు. అక్కడ ఆయనతో చర్చిస్తుండగా అక్కడికి వచ్చిన టీడీపీ నాయకుడు లాయర్ శ్రీనివాస్‌కు వైసీపీ నాయకులకు మధ్య వివాదం జరిగింది. స్పందించిన పోలీసులు వివాదాన్ని అణిచివేశారు.

News May 2, 2024

నేడు ధర్మవరానికి ప్రముఖ హీరోయిన్ నమిత

image

ధర్మవరం పట్టణానికి ఇవాళ ప్రముఖ హీరోయిన్ నమిత విచ్చేస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌కు మద్దతుగా ఆమె ప్రచారంలో పాల్గొననున్నారు. ధర్మవరం పట్టణంలో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.