Anantapur

News May 2, 2024

అనంత: మరో 3 నెలలు తిరుపతి- కదిరిదేవరపల్లి రైలు రద్దు

image

రాయదుర్గం మీదుగా ప్రయాణించే తిరుపతి-కదిరిదేవరపల్లి రైలును మరో మూడు నెలల పాటు రద్దుచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 07589 నంబరు రైలును జులై 31 వరకు, 07590 రైలును ఆగస్టు 1వ తేదీ వరకు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కారణంగా ఈ రైలును రద్దు చేస్తున్నట్లు ప్రతి నెలా రైల్వే అధికారులు ప్రకటనలిస్తున్నారు. జనవరి నుంచి జులై వరకు ఈ రైలును పలు కారణాలతో రద్దు చేశారు.

News May 2, 2024

అనంతపురం జిల్లా టీడీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి చోటు

image

టీడీపీ రాష్ట్ర కమిటీలో అనంతపురం జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. గుంతకల్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తమ్మినేని నటేస్ చౌదరి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, రాయదుర్గం నుంచి మాజీ జడ్పీ ఛైర్మన్ పులా నాగరాజును రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.

News May 2, 2024

అనంత జిల్లా వ్యాప్తంగా 70 శాతం పింఛన్ల పంపిణీ

image

జిల్లా వ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీ 70శాతం పూర్తిచేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పింఛన్‌దారుల ఖాతాల్లోకి మొదటి రోజే దాదాపు నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 2,88,334 మందికి రూ.86.332 కోట్ల పింఛన్ మొత్తం విడుదలైందన్నారు. ఆధార్ అనుసంధానమైన 2,02,716 మంది పింఛన్‌దారులకు ఖాతాల్లోకి రూ.60.815 కోట్లు జమ చేస్తామన్నారు. 85,618 మంది ఇళ్ల వద్దకు వెళ్లి రూ. 25.517 కోట్లు పంపిణీ చేశామన్నారు.

News May 2, 2024

అనంత: నీళ్ల ట్యాంకర్ బోల్తాపడి యువకుడి మృతి

image

నీళ్ల ట్యాంకర్ బోల్తాపడి యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు రాముడు తన కుమారుడు సోమశేఖర్‌తో కలిసి చీనిచెట్లకు నీళ్లు తెచ్చేందుకు నీళ్ల ట్యాంకర్ తీసుకెళ్లారు. ఈ క్రమంలో కమలాపురం వద్ద ప్రమాదవశశాత్తు ట్యాంకర్ బోల్తాపడి సోమశేఖర్ మృతిచెందగా.. తండ్రి రాముడికి తీవ్రగాయాలయ్యాయి.

News May 2, 2024

ఆంధ్ర క్రికెట్‌ సంఘం శిబిరాలకు జిల్లా శిక్షకులు ఎంపిక

image

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలకు నిర్వహించనున్న క్రికెట్‌ శిక్షణ శిబిరాలకు జిల్లాకు చెందిన పలువురిని శిక్షకులుగా ఎంపిక చేశారు. జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి మధుసూదన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చెందిన బొమ్మన్న సీనియర్‌ మహిళా జట్టుకు నైపుణ్య శిబిరానికి టైనర్‌గా నియమించారు. శర్మాస్‌వలిని జూనియర్‌ మహిళా జట్టుకు మొదటి బ్యాచ్‌ శిక్షకుడిగా, రెండో బ్యాచ్ శిక్షకుడిగా K.నరేశ్‌ను నియమించారు.

News May 2, 2024

గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌కు టీడీపీ కీలక పదవి

image

గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌కు రాష్ట్రస్థాయి పదవి దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు జితేంద్ర గౌడ్‌కు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. గుంతకల్లు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయనను తప్పించి గుమ్మనూరు జయరాంకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జితేంద్రగౌడ్‌కు రాష్ట్రస్థాయి పదవి దక్కడంతో నియోజకవర్గ టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News May 2, 2024

ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎన్నికల అధికారి

image

ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని విధాల సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఆయా రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. నోడల్ టీమ్‌లు సమన్వయ సహకారాలతో అప్రమత్తంగా ఉంటూ పనులను పూర్తి చేయాలన్నారు.

News May 1, 2024

అనంత: పాము కాటుకు గురై మహిళ మృతి

image

డీ.హీరేహల్ మండలం మురడి గ్రామానికి చెందిన కవితమ్మ(35) పాము కాటుకు గురై మృతిచెందినట్లు ఎస్ఐ గురు ప్రసాద్ రెడ్డి బుధవారం తెలిపారు. 29న భర్త, కుమారుడితో పాటు ఆరుబయట పడుకున్న సమయంలో పాము కాటుకు గురైంది. వెంటనే ఆమెను బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. భర్త దాసప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈమెకు ముగ్గురు కుమారులు.

News May 1, 2024

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి: అమిత్ కుమార్

image

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీల వ్యవహరించాలని పార్లమెంటరీ ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఖర్చులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈనెల 6, 10వ తేదీలలో అభ్యర్థులు ఖర్చు చేసిన వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేస్తామన్నారు.

News May 1, 2024

ఈనెల 4న హిందూపురంలో సీఎం జగన్ పర్యటన

image

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈనెల 4న రోడ్ షో కార్యక్రమం ఉంటుందని హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక తెలిపారు. పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల అభ్యర్థులను హిందూపురం సభ ద్వార పరిచయం చేయనున్నారు. జగన్ రాకకోసం భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు ఆమె తెలిపారు.