India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రొద్దం మండలం పెద్దగువ్వలపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ముళ్లపొదలో అప్పుడే పుట్టిన మగ బిడ్డను వదిలి వెళ్లారు. ఈ ఘటన స్థానికులను కలిచివేస్తుంది. గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐసీడీఎస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతపురంలో ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడిన ఓ వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురంలోనని సోమనాథనగర్‌కు చెందిన నరేశ్(30) మిల్క్ డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడు ఆన్‌లైన్‌లో జూదానికి అలవాటుపడి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. దానికి తోడు మిల్క్ డెయిరీ సంబంధించిన డబ్బులు వాడుకోవడంతో ఒత్తిడి చేశారు. మనస్తాపానికి గురై గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన వడ గాలులు వీస్తాయని రేకలకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. మే 1, 2, 3వ తేదీల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు ఉదయం 10 గంటల తర్వాత విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఎండలో పనిచేస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
అనంతపురం జిల్లాలో బుధవారం నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేస్తారని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తెలిపారు. పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని తహశీల్దార్లను ఆదేశించారు. కార్డులోని ప్రతి సభ్యునికి 5 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల ఫోర్టిఫైడ్ బియ్యం ఉచితంగా ఇస్తారన్నారు. చక్కెర ఏఏవై కార్డు లకు కిలో రూ.13.50, మిగతా కార్డుదారులకు అర కిలో రూ.17 ప్రకారం అందిస్తున్నట్లు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పోలీస్ అబ్జర్వర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా నియమించిన పోలీస్ అబ్జర్వర్‌కు చెందిన 9502846080 ఫోన్ నంబర్‌కు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.
కంబదూరులో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. కంబదూరుకి చెందిన సూర్య, అరుణ దంపతుల ఏకైక కుమార్తె ప్రణీత(14) ఈతకు వెళ్లి మృతి చెందింది. ప్రణీత తన బంధువులతో కలిసి గ్రామ శివారులోని తోటలో ఉన్న ఫామ్ పాండ్‌లో ఈత కొడుతూ ఊపిరాడక మృతి చెందింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికల నేపథ్యంలో అనంతపురం రూరల్ ఎంపీటీసీ నగేశ్‌పై మంగళవారం హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
శ్రీ కృష్ణదేవరాయ విద్యాలయ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ తదితర యూజీ కోర్సుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు త్వరలో మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ జారీ చేస్తామని వీసీ హుస్సేన్ రెడ్డి తెలిపారు.1994-95 నుంచి 2014-15, సెమిస్టర్ విధానంలో 2015-2019 మధ్య పరీక్ష తప్పిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్కేయూ పరీక్షల విభాగం తెలిపింది.
గుంతకల్ రైల్వే డివిజన్‌లోని హుబ్లీ-గుంతకల్ ప్రధాన రైలు మార్గంలో జరుగుతున్న పనుల కారణంగా ఈ మార్గంలో తిరిగే ప్యాసింజర్ రైలు సర్వీసులను మంగళవారం నుంచి పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు హుబ్లీ-తోర్నకల్ మధ్య మాత్రమే ప్యాసింజర్ రైలు తిరుగుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు షేక్ బాషకు పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.3000 జరిమాన విధిస్తూ అనంతపురం ఫోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు వెల్లడించారు. 2020లో బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో సాక్ష్యాలు రుజువు కావడంతో శిక్ష విధించింది. శిక్ష పడే విధంగా చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Sorry, no posts matched your criteria.