India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా వాసులను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. గుంతకల్లులో సోమవారం అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శింగనమల, తలుపులలో 44.1, బొమ్మనహాళ్ 43.9, యల్లనూరు, తాడిపత్రి, అనంతపురంలో 43.7, పెద్దవడుగూరు 43.2, కూడేరు, చెన్నేకొత్తపల్లి, కొత్తచెరువులో 43.0, విడపనకల్లు, బుక్కరాయసముద్రం 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
అనంతపురం జిల్లాలో మొత్తం 20,18,162 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మే 13న జరిగే పోలింగ్‌లో వారు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇటీవల 16,962 మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. దీంతో జిల్లాలో మొత్తం ఓటర్లు ఓటర్ల సంఖ్య 20,18,162 మంది ఉండగా అందులో పురుషులు 9,97,792 మంది, స్త్రీలు 10,20,124, ఇతరులు 246 మంది ఉన్నారు.
అనంత ఎంపీ, తాడిపత్రి అసెంబ్లీ పరిధిలో రెండేసి ఈవీఎంలు ఉంటాయి. ఒక్కో ఈవీఎంలో గరిష్ఠంగా 16 మంది పేర్లు, గుర్తులు కేటాయించేందుకు అవకాశం ఉండగా.. అనంత ఎంపీ బరిలో 21, తాడిపత్రిలో 18 మంది ఉన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్‌లో లోక్ సభ ఈవీఎంలు 2, అసెంబ్లీకి 1 ఉంటాయి. తాడిపత్రి పరిధిలో లోక్ సభకు సంబంధించి 2, అసెంబ్లీకి మరో 2 ఇలా ఒక్క తాడిపత్రి పరిధిలో ప్రతి పోలింగు కేంద్రంలో 4 ఉంటాయి.
అనంత జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలకు 113 మంది పోటీలో ఉన్నారు. ఉరవకొండ మినహా మిగతా 7 చోట్లా 23 మంది నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. అత్యధికంగా తాడిపత్రి 18, తక్కువగా ఉరవకొండలో 11 మంది పోటీలో ఉన్నారు. అనంత అర్బన్, కళ్యాణదుర్గంలో 15, శింగనమల, గుంతకల్లులో 14, రాయదుర్గం, రాప్తాడులో 13 చొప్పున పోటీలో నిలిచారు. ఇక అనంత ఎంపీకి 21మంది బరిలో ఉన్నారు. ఇక్కడ ఒక్కరు కూడా ఉపసంహరించుకోలేదు.
ముదిగుబ్బ పట్టణం పాత ఊరికి చెందిన మోపూరి ప్రణీత్ కుమార్ (24) వడదెబ్బతో సోమవారం మృతి చెందినట్లు అతడి కుటుంబీకులు తెలిపారు. ప్రణీత్ కుమార్‌కు ఆదివారం వడదెబ్బ తగలడంతో పరిస్థితి విషమించింది. చికిత్స నిమిత్తం బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రణీత్ మృతి చెందాడు. ప్రస్తుతం ప్రణీత్ కుటుంబ సభ్యులు అనంతపురంలో నివాసం ఉంటున్నారు.
ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హిందూపురం సమీపంలోని బిట్స్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాలు నిరంతరం బందోబస్తు చేపట్టే గార్డ్, సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లు పరిశీలించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు నిరంతరం పహారా కాస్తు ఉండాలన్నారు.
హిందూపురం ఎంపీ అభ్యర్థులుగా 13మంది బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉపసంహరణ అనంతరం పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం 15మంది అభ్యర్థులు బరిలో ఉండగా సోమవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణ చేసుకున్నారని తెలిపారు.
మడకశిర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న, తనయుడు సునీల్ కుమార్ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. సోమవారం మడకశిర తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఈరన్నతో పాటు సునీల్ కుమార్ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థి ఎమ్మెస్ రాజుకు మద్దతు పలికారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలోని కొండేపల్లిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక్కటే గ్రామం అయినప్పటి శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో ఉండటం విశేషం. దీంతో ఆ ఊరి ఓటర్లు ఇద్దరు ఎమ్మెల్యేలను ఎన్నుకొంటారు. 2009కి ముందు గ్రామస్థులు ఇద్దరు ఎంపీలను ఎన్నుకునేవారు. పుట్లూరు మండల పరిధిలోని ఓటర్లు హిందూపురం లోక్ సభ, ధర్మవరం అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉండేవారు. పునర్విభజన అనంతరం వీరిని శింగనమల నియోజకవర్గంలోకి తెచ్చారు.
ఉమ్మడి అనంత జిల్లాలో ఆదివారం అనంత నగరంలో రికార్డు స్థాయిలో 44.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవ రెడ్డి, నారాయణస్వామి తెలిపారు. బుక్కరాయసముద్రంలో 43.2, తాడిపత్రి, నంబులపూటకుంట, పుట్టపర్తి 40.5, తనకల్లు, గోరంట్లలో 40.4 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.