Anantapur

News April 29, 2024

శ్రీ సత్యసాయి: ‘ఫిర్యాదుల విషయంలో హేతుబద్ధత కలిగి ఉండాలి ’

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల విషయంలో హేతు భద్రత కలిగి ఉండాలని ఎన్నికల పరిశీలకులు అన్బు కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు.

News April 28, 2024

 వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే నాగరాజు 

image

పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే నాగరాజు రెడ్డి ఆదివారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. నేడు తాడిపత్రిలో జరిగిన సీఎం సభలో జగన్ ఆయనకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని నాగరాజు తెలిపారు. 

News April 28, 2024

గుంతకల్ రైల్వే స్టేషన్‌లో భారీగా నగదు సీజ్

image

గుంతకల్ రైల్వే స్టేషన్ వద్ద ఎన్నికల నేపథ్యంలో ఆదివారం రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ మహిళ బ్యాగులో ఎలాంటి రశీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.50 లక్షల నగదును సీజ్ చేసినట్లు రైల్వే సీఐ నగేశ్ బాబు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం, గంజాయి, డబ్బును అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రజలను సీఐ హెచ్చరించారు.

News April 28, 2024

బీసీ గురుకుల ప్రవేశ పరీక్షకు 494 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలకు 494 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి ఖుష్బు కొఠారి తెలిపారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించారు. జిల్లాలో 11 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్షలకు 2537 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 2043 మంది హాజరయ్యారని తెలిపారు.

News April 28, 2024

తాడిపత్రిలో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

image

తాడిపత్రిని పోలీసులు తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. నేడు సీఎం జగన్ పర్యటిస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 26 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలతో పాటు 2000 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించారు. బందోబస్తును 6 సెక్టార్లుగా విభజించారు. ఒకరోజు ముందే తాడిపత్రికి చేరుకుని తమకు కేటాయించిన స్థానాలలో విధులు చేపట్టారు.

News April 28, 2024

నార్పల మండలం వాలంటీర్ సస్పెండ్

image

నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన వాలంటీర్ ఓలయ్యను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 81 మంది వాలంటీర్లు, 18 డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు, 30 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 8 మంది రెగ్యులర్ ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నారు.

News April 28, 2024

ALERT: అనంతపురం@ 43.7

image

భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. దేశంలోనే నంద్యాలలో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. కర్నూలులో 44.5 అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నంద్యాల నిలవడం గమనార్హం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

News April 27, 2024

తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో బయలుదేరి 9:45 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10:30 గంటలకు తాడిపత్రి చేరుకుంటారు. 11 గంటల నుంచి 11:45 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తిరుపతి జిల్లా వెంకటగిరికి వెళ్లనున్నారు.

News April 27, 2024

అనంత: రైలు కిందపడి వెస్ట్ బెంగాల్ వాసి ఆత్మహత్య

image

గుంతకల్లు పట్టణ శివారులో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన విశ్వజిత్ అనే వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 27, 2024

అనంత: పరీక్ష రాయడానికి వెళుతూ.. విద్యార్థిని దుర్మరణం

image

నార్పల మండల పరిధిలోని నడి దొడ్డి గ్రామానికి చెందిన నాగార్జున కూతురు ఝాన్సీ(9) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గురుకుల పాఠశాలలో పరీక్షలు రాయడానికి తండ్రి, కూతురు మరో విద్యార్థి బైక్ మీద బయలుదేరారు. ఈ క్రమంలో కేశేపల్లి వద్ద కుక్క దూరడంతో బైక్ అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి ఝాన్సీ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ఇద్దరికి గాయలయ్యాయి.