India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు RDT సెట్ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి.మోహన్ మురళి తెలిపారు. 10వ తరగతిలో 500 మార్కులుపైన సాధించిన విద్యార్థులను రాష్ట్రంలోని వివిధ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో చేర్పించి ఫీజులన్నీ RDT భరిస్తుందన్నారు. మే 4 నుంచి 10వ తేదీలోపు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. వివరాల కోసం సంప్రదించాలని కోరారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథికి పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం నుంచి మడకశిరకు ఆయన కారులో వెళుతుండగా చెన్నేకొత్తపల్లి వద్ద ముందు వెళుతున్న ఐచర్ వాహనాన్ని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో పార్థసారథి సురక్షితంగా బయటపడ్డారు. ఐచర్ డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగిందని కారులో ఉన్న వారు తెలిపారు.
మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం. ఎస్ రాజుపై మెుత్తం 47 కేసులు నమోదైనట్లు తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరాస్తుల విలువ ఎం. ఎస్ రాజుపై రూ.1,29,218, అతని భార్యపై రూ.750549 ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు అతనిపై రూ.1.50 లక్షలు, భార్యపై రూ. 2.5 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఆయన పేరుపై రూ.2.5 లక్షల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో భానుడు రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చాడు. శుక్రవారం అత్యధికంగా బొమ్మనహల్ మండలంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు రేకులకుంట పరిశోధన స్థానం శాస్త్రవేత్త సహదేవరెడ్డి తెలిపారు అదేవిధంగా యల్లనూరు, తాడిపత్రి, 43.3, గుంతకల్, తాడిపత్రి,43.1, శింగనమల, చెన్నేకొత్త పల్లి,43.0, పరిగి 42.9, పుట్టపర్తి 42.9, ముదిగుబ్బ 42.8, యాడికి 42.5 నమోదైనట్లు తెలిపారు.
ధర్మవరంలో శుక్రవారం రాత్రి దారుణ హత్య జరిగింది. గీతానగర్‌లోని రమేశ్‌కు అతడి పిన్ని నారాయణమ్మ కుమారుడు మణి పట్టుచీర అమ్మాడు. అందుకు సంబంధించిన రూ.10వేలు ఇవ్వాలని రమేశ్‌ను అడగడంతో మాటమాట పెరిగి మణి ఛాతిలో కత్తితో పొడిచాడు. అడ్డువచ్చిన మణి అన్న మణికంఠపై, తల్లి సావిత్రిని రమేశ్ కత్తితో పొడిచి గాయపరిచాడు. మణిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు.
పుట్టపర్తి రూరల్ మండలం వెంగళమ్మ చెరువులో శుక్రవారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం.. ఈడిగ పవన్ వాలంటీర్ ఉద్యోగం చేస్తూ ఇటీవల రాజీనామా చేశాడు. భార్య త్రివేణి(25) ఇంటి వద్ద ఉంటూ పిల్లలను చూసుకునేవారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను నరికి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆర్డీటీ సెట్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని పెనుకొండ ఆర్డీటీ కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ప్రస్తుతం పదవ తరగతి ఉత్తీర్ణులైన పేద, గ్రామీణ, ప్రతిభావంతులైన విద్యార్థులు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్, రేషన్ కార్డ్, క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు, 4 ఫొటోలు తీసుకుని మండల పరిధిలోని ఆర్డీటీ ఆఫీసులో మే 4వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.
తాడిపత్రిలో దాఖలైన ఎన్నికల నామినేషన్లలో 2 రిజెక్ట్ చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. శుక్రవారం వాటిని పరిశీలించి ఇది వరకే ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు అంగీకరించినందున కేతిరెడ్డి రమాదేవి, జేసీ ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు.
అనంతపురం జిల్లాలో శనివారం పాలిసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ జయచంద్ర రెడ్డి తెలిపారు. జిల్లాలో 24 పరీక్ష కేంద్రాల్లో 8880 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఓపెన్ పది, ఇంటర్ ఫలితాలు గురువారం విడుదల చేసినట్లు జిల్లా పరీక్షల విభాగం ఏడీ లాజర్ తెలిపారు. ఓపెన్ ఇంటర్మీడియట్‌లో 1,525మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 888మంది పాసై 58.23% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు రాసిన 703మంది విద్యార్థుల్లో 249 మంది పాసై 35.42% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వస్థానం సాధించారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.