India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బుక్కపట్నం మండలం లింగప్ప గారి పల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. అందులో వెంకట నరసా నాయుడు, ప్రభాకర్ మృతి చెందినట్లు తెలిపారు. మరో వ్యక్తి శ్రీరాములు చికిత్స పొందుతున్నారు. ఒకే గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 28వ తేదీన ఉదయం 10 గంటలకు తాడిపత్రి పట్టణంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసీల రఘురాం ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రిలో బహిరంగ సభ అనంతరం వెంకటగిరికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సత్యసాయి జిల్లాకు ఇద్దరు జనరల్ ఎన్నికల కమిషన్ నియమించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అన్బుకుమార్, మహారాష్ట్రకు చెందిన దీపక్ రామచంద్ర తివారి గురువారం సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుతో భేటీ అయ్యారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయవచ్చునని సంబంధిత అబ్జర్వర్లు పేర్కొన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లాలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి 231మంది నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పరిధిలోని మడకశిర, హిందూపురం, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే స్థానాలకు 231 మంది నామినేషన్లు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.
డీ.హీరేహాళ్ మండలం కర్ణాటక సరిహద్దులోని జజిరికల్ టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఐదుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు దైవదర్శనం నిమిత్తం మంత్రాలయానికి కారులో ప్రయాణిస్తూ ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నందీశ్ అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.
వైసీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడిగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో మరోసారి వైసీపీని గెలిపించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.
శింగనమల వైసీపీ ఎమ్యెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు తన నామినేషన్ అఫిడవిట్‌కు సంబంధించి చరాస్తుల విలువ రూ.1,06,195గా పేర్కొన్నారు. అలాగే తనపై ఎటువంటి స్థిరాస్తులు, అప్పులు లేనట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. 2014లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు.
హిందూపురం పార్లమెంటు నుంచి బుధవారం ఆరుగురు నామినేషన్లు వేసినట్టు సత్యసాయి జిల్లా రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. ఆర్ఎస్పీ పార్టీ నుంచి ఏ.శ్రీనివాసులు, నేషనల్ నవ క్రాంతి నుంచి ధనుంజయ బూదిలి, స్వతంత్ర అభ్యర్థిగా కుల్లాయప్ప, కాంగ్రెస్ పార్టీ నుంచి షాహిన్, వైసీపీ నుంచి శాంత, బీఎస్పీ నుంచి భాగ్య నామినేషన్లు వేసినట్టు ఆయన పేర్కొన్నారు.
ఇండియన్ రైల్వేస్‌లోని డీజిల్ లోకో షెడ్ నందు త్రీ ఫేజ్ జీ-9 ఎలక్ట్రికల్ ఇంజిన్ల నిర్వహణలో గుత్తి లోకో డీజిల్ షెడ్ సెకండ్ బెస్ట్ డీజిల్ షెడ్‌గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జై షీల్డ్ బహుకరించారు. గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ రమేష్ షీల్డ్ అందుకున్నారు.
ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఈనెల 26వ తేదీ లోపు ఫామ్-12ను సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. ఎన్నికలలో విధులు నిర్వర్తించడానికి ఉత్తర్వులు పొందిన ఉద్యోగులు ఫామ్-12ను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందించి పోస్టల్ బ్యాలెట్ పొందాలన్నారు. 26వ తేదీ లోపల అందించని పక్షంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను కోల్పోతారన్నారు.
Sorry, no posts matched your criteria.