Anantapur

News April 24, 2024

కాల్వ శ్రీనివాసులు ఆస్తుల వివరాలు

image

రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
విద్యార్హత :MA,
కేసులు :15,
చరాస్తులు: రూ.10.33 లక్షలు,
బంగారం: 90 గ్రాములు,
స్థిరాస్తులు: రూ. 5.45 కోట్లు,
అప్పులు: 1.02 కోట్లు ఉన్నట్లు నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో వారు పేర్కొన్నారు.

News April 24, 2024

ధర్మవరం: పెయింటర్ కూతురుకి.. 594 మార్కులు

image

ధర్మవరం మండలం కుణుతూరు గ్రామానికి చెందిన S.దీక్షిత పోతుకుంటలో గల పాఠశాలలో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 594 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్‌లో 100కి 100 మార్కులు సాధించారు. దీక్షిత తండ్రి నరసింహులు పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఈ విద్యార్థిని ప్రతిభ పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News April 24, 2024

అనంత: పోలింగ్ రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు

image

ఆనంతపురం జిల్లాలో వ్యాపార, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు మే13న పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు డిప్యూటీ లేబర్ కమిషనర్ లక్ష్మినరసయ్య తెలిపారు. యాజమాన్యాలు ఆ రోజు సెలవు పాటించాలని తెలిపారు. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెలవు మంజూరు చెయ్యని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News April 24, 2024

అనంతపురం: ఎన్నికల మస్కట్‌గా వేరుశనగ

image

అనంతపురం జిల్లా ఎన్నికల మస్కట్‌గా ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థి ప్రశాంత కుమార్‌ రూపొందించిన ‘వేరుశనగ’ ఆకృతి ఎంపిక చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదట ఎన్నికల మస్కట్‌ను రూపొందించిన జిల్లాగా అనంతకు ఖ్యాతి దక్కిందని కలెక్టర్ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల మస్కట్‌ ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 62 మస్కట్‌లు రాగా న్యాయ నిర్ణేతలు వేరుశనగ మస్కట్‌ను ఎంపిక చేశారు.

News April 24, 2024

గుమ్మనూరు జయరాం ఆస్తుల విలువ రూ.78.93 లక్షలు

image

గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో నమోదు చేసిన వివరాలు.. ఆయన ఎస్‌ఎస్ఎల్‌సీ విద్యార్హతగా పేర్కొన్నారు. ఆయనపై ఒక్క కేసు ఉంది. అదేవిధంగా చరాస్తులు రూ.18.93 లక్షలు, స్థిరాస్తులు రూ.60లక్షలు, బంగారం 173 గ్రాములు, అప్పులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News April 24, 2024

అనంత: నేటి నుంచి డిగ్రీ పరీక్షలు

image

అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో మంగళవారం నుంచి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. ఇవాళ నుంచి ఈ నెల 29వ తేదీ వరకు యూజీ 2, 4, 6 సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ ఓ ప్రకటనలో తెలిపారు.

News April 24, 2024

జిల్లాలో నాల్గో రోజు 23 నామినేషన్ల దాఖలు: కలెక్టర్ అరుణ్

image

ఎన్నికలకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం మొత్తం 23 నామినేషన్లు దాఖలు అయినట్లు కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానానికి ముగ్గురు, రాప్తాడు అసెంబ్లీ స్థానానికి ముగ్గురు, మడకశిర నుంచి నలుగురు, హిందూపురం నుంచి ఐదు, పెనుకొండ నుంచి ఒకటి, పుట్టపర్తి నుంచి ముగ్గురు, ధర్మవరం నుంచి ఒకరు, కదిరి నుంచి ఐదుగురు నామినేషన్లు వేశారన్నారు.

News April 24, 2024

అనంత : 598 మార్కులతో సత్తా చాటిన టి.ప్రణతి

image

అనంతపురం నగరానికి చెందిన టి.ప్రణతి సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాలలో 598 మార్కులతో సత్తా చాటి రాష్ట్ర టాపర్లలో ఒకరిగా నిలిచింది. ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగడమే తన లక్ష్యమన్నారు. ఆమెను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చుట్టాలు అభినందించారు.

News April 24, 2024

26లోగా దరఖాస్తులను సమర్పించాలి: కలెక్టర్ అరుణ్

image

26వ తేదీలోగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను అందజేయాలని శ్రీ సత్యసాయి కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా పని చేసే చోట ఫామ్-12ను సమర్పించే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకోవచ్చన్నారు.

News April 24, 2024

అనంత: 594 మార్కులతో సత్తా చాటిన బైనేని జాష్ణవి

image

అనంతపురం నగరానికి చెందిన బైనేని జాష్ణవి సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాలలో 594 మార్కులతో సత్తా చాటింది. ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగడమే తన లక్ష్యమన్నారు. ఆమెను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.