Anantapur

News June 12, 2024

అనంతపురం జేఎన్టీయూ ఎంసీఏ ఫలితాలు విడుదల

image

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో ఈ ఏడాది మేలో నిర్వహించిన ఎంసీఏ నాలుగో సెమిస్టర్ (R-20) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. మొత్తం 98% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ వెల్లడించారు. తక్కువ సమయంలోనే ఫలితాల విడుదలకు కృషి చేసిన డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ డీ.విష్ణువర్ధన్‌ను అభినందించారు.

News June 12, 2024

అనంత: విద్యా సంస్థలకు ఒకరోజు అదనపు సెలవు

image

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలు పునఃప్రారంభించాల్సిన ఉండగా ఒకరోజు సెలవు పొడిగించినట్లు సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారిణి మీనాక్షి తెలిపారు. ఈ మేరకు ఆయా విద్యా సంస్థల వారు ఈనెల 12వ తేదీన కాకుండా 13వ తేదీన విద్యాసంస్థలను ప్రారంభించాలని ఆదేశించారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమంగా ఒకరోజు అదనపు సెలవును ప్రకటించారు.

News June 12, 2024

శ్రీ సత్యసాయి: తొలిసారి గెలుపు.. వరించిన మంత్రి పదవి

image

పెనుకొండ MLA సవితకు తొలిసారి కేబినెట్‌లో స్థానం దక్కింది. ఈమె వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌పై గెలుపొందారు. ఈమె 1977 జనవరి 15న పెనుకొండ మండలం రామపురంలో జన్మించారు. తండ్రి ఎస్.రామచంద్రరెడ్డి. 1998లో అనంతపురం శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీలో BA పూర్తి చేశారు. 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈమె.. 2018లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా చేశారు. ఈ ఎన్నికల్లో తొలిసారి తొలిసారి గెలుపొందారు.

News June 12, 2024

పయ్యావుల, సత్యకుమార్, సవితకు మంత్రి పదవులు

image

ఉమ్మడి అనంత జిల్లా నుంచి ముగ్గురిని మంత్రి పదవులు వరించాయి. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ (బీజేపీ), ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పెనుకొండ ఎమ్మెల్యే ఎస్.సవితకు కేబినెట్‌లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. ఆ ఒక్కరూ మన ధర్మవరం ఎమ్మెల్యే కావడం విశేషం. వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

News June 12, 2024

శ్రీసత్యసాయి: మున్సిపల్ కేంద్రాల్లో ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం

image

చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం ప్రత్యక్ష ప్రసారం సత్యసాయి జిల్లాలోని అన్ని మున్సిపల్ కేంద్రాలలో ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి అన్ని మున్సిపాలిటీలలోని ప్రధాన కేంద్రాలలో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుందన్నారు. దీనిని తిలకించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లు, టీవీ సెట్లను ఏర్పాటు చేశామన్నారు.

News June 11, 2024

అనంత: విధులు నిర్వహిస్తూ గుండెపోటుకు గురైన జేఎల్ఎం

image

విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా విధులు నిర్వహిస్తున్న జిలాన్ బాషా గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం ఉదయం కనేకల్లు మండలంలోని మాల్యం వద్ద విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఛాతి నొప్పితో సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన తోటి ఉద్యోగులు ఆయనని కనేకల్లు క్రాస్ వద్ద ఉన్న ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు.  పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు.

News June 11, 2024

ఉరవకొండ: చెట్టు కొమ్మ మీదపడి వ్యక్తి మృతి

image

ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంగళవారం మద్యాహ్నం గ్రామానికి చెందిన బూదగవి రామలింగ అనే వ్యక్తి స్థానికి సత్యసాయి పంపుహౌస్ వద్ద నీళ్లు పట్టుకుంటుండగా ఒక్కసారిగా పైనుంచి ఎండిన చెట్టు కొమ్మ విరిగి మీద పడింది. దీంతో తీవ్రంగా గాయపడిని అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News June 11, 2024

పెనుకొండలో రేపటి నుంచి అన్న కాంటీన్ పునః ప్రారంభం

image

పెనుకొండ పట్టణంలో ఎమ్మెల్యే సవిత ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ను బుధవారం నుంచి తిరిగి ప్రారంభం చేయనున్నట్లు మంగళవారం సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ వల్ల అన్న క్యాంటీన్ నిర్వహణ సాధ్యం కాలేదని ఆమె తెలిపారు. జూన్ 12 బుధవారం నుంచి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్‌ను సవిత తిరిగి ప్రారంభిస్తున్నారు. అన్న క్యాంటీన్ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News June 11, 2024

రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలుడి మృతి

image

చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఉడేగోళానికి చెందిన పదో తరగతి చదువుతున్న చరణ్‌ను రెండు నెలల కిందట రాయదుర్గం మండలం 74 ఉడేగోళం వద్ద ఉన్న హైవేపై రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబీకులు బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 11, 2024

అనంత: 15న హాకీ జట్టు ఎంపిక పోటీలు

image

అనంతపురం స్థానిక ఆర్డీటీ స్టేడియంలో జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలను ఈనెల 15న శనివారం నిర్వహిస్తున్నట్లు హాకీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి అనీల్‌కుమార్‌ తెలిపారు. ఆసక్తి, అర్హత గల క్రీడాకారులు ఆధార్‌కార్డు, పదోతరగతి మార్కుల జాబితా, జనన ద్రువీకరణ పత్రం, క్రీడా సామగ్రి, యూనిఫాంతో హాజరుకావాలన్నారు. ఎంపికైన జట్టు ఈ నెల 27 నుంచి ధర్మవరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.