India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎమ్మెస్ రాజుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఈ మేరకు బీఫామ్ ఆయన చేతికి ఆదివారం అందించినట్లు మడకశిర టీడీపీ నాయకులు తెలిపారు. ఇంతకు ముందు డాక్టర్ సునీల్ కుమార్‌కు పార్టీ టికెట్ కేటాయించింది. మార్పులు చేర్పుల్లో భాగంగా మడకశిర టికెట్‌ను ఎమ్మెస్ రాజుకు కేటాయించారు.
అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదులు తెలియజేయవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్ కుమార్ తెలిపారు. సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణ కోసం 08554-232922, 6300907233, పోలింగ్ సిబ్బంది పర్యవేక్షణ కోసం 08554 – 231922, 6300923894 నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు.
ఉరవకొండ-గుంతకల్లు ప్రధాన రహదారిలోని గూళ్యపాళ్యం శివారులో శనివారం ట్రాక్టరు నుంచి కిందపడి కొనకొండ్లకు చెందిన విశ్వాసరావు(19) మృతి చెందాడు. అతడు శుక్రవారం తరిమెల గ్రామంలో మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు. శనివారం గ్రామానికి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ నుంచి జారి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై నరేశ్ తెలిపారు.
అనంతపురం జిల్లాలో శనివారం పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. యాడికిలో అత్యధికంగా 40.4 డిగ్రీలు, శింగనమలలో 39.5, నంబులపూలకుంట 39.4, ధర్మ వరం 38.7, కదిరి 38.5, తాడిపత్రి 38.4, అనంతపురం 38, యల్ల నూరు 37.9, తనకల్లు 37.7, కనగానపల్లి, గాండ్లపెంట 37.5, రాప్తాడు 37. 4, పుట్లూరు 37. 3 డిగ్రీలుగా నమోదైందన్నారు.
పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లికి చెందిన ఆకుల వీరప్ప పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. శనివారం సాయంత్రం మేకలను మేపుకొని ఇంటికి వస్తుండగా వర్షం రావడంతో వీరప్ప మర్రిచెట్టు కిందకి వెళ్ళాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో వీరప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పుట్టపర్తి మండలంలోని దిగువ చెర్లోపల్లికి చెందిన ఆకుల వీరప్ప పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. శనివారం సాయంత్రం మేకలను మేపుకొని ఇంటికి వస్తుండగా వర్షం రావడంతో వీరప్ప మర్రిచెట్టు కిందకి వెళ్ళాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో ఆకుల వీరప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
➤ అసెంబ్లీ: రాప్తాడు
➤ భర్త: పరిటాల రవీంద్ర
➤ విద్యార్హతలు: 8వ తరగతి పాస్
➤ చరాస్తి విలువ: రూ. 2.50 లక్షలు
➤ స్థిరాస్తులు రూ.28.53 కోట్లు
➤ కేసులు: 8
➤ అప్పులు: రూ.31.68
➤ బంగారం: 750 గ్రాముల
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
గుమ్మఘట్ట మండలం కొత్తపల్లికుంట దొడ్డి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్ మూవ్మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. కర్నాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చెక్ పోస్టు గుండా వెళ్లొచ్చే రహదారికి ప్రత్యామ్నాయంగా ఉన్న దారులపై ప్రత్యేక నిఘా వేసి అక్రమాలకు కళ్లెం వేయాలన్నారు.
రాప్తాడు, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు 14 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 3వ రోజు హిందూపురం పార్లమెంటుకు సంబంధించి 4 సెట్లు నామినేషన్ దాఖలు అయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మూడో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగిందన్నారు.
ధర్మవరం పట్టణం డీఎల్ఆర్ కాలనీ సమీపంలో శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సంఘటనా ప్రదేశానికి వెళ్లి పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని బంధువులు ఎవరైనా ధర్మవరం రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.