Anantapur

News June 4, 2024

25 ఓట్ల తేడాతో మడకశిరలో గెలుపు

image

మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు విజయం సాధించారు. హోరాహోరిగా సాగిన కౌంటింగ్ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి ఈర లకప్పపై 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుకు 78347ఓట్లు, వైసీపీ అభ్యర్థి ఈర లకప్పకు 78322ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

37వేల మెజారిటీతో కాల్వ ఘన విజయం

image

రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించారు. కాల్వ శ్రీనివాసులు మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తూ ముందంజలో దూసుకెళ్లారు. వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై 22 రౌండ్లు పూర్తయ్యేసరికి 37,268 ఓట్ల తేడాతో గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంకా కలపాల్సి ఉంది.

News June 4, 2024

ఎనిమిదో రౌండ్ పూర్తి..బీకే పార్థసారథి ముందంజ

image

హిందూపురం బిట్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ ఎనిమిదో రౌండ్ పూర్తైంది. 8వ రౌండ్ పూర్తయ్యేసరికి హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే.పార్థసారథి 47,143 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్‌లో టీడీపీకి 47,143 ఓట్లు, వైసీపీకి 28,990 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

News June 4, 2024

గుంతకల్లులో గుమ్మనూరు జయరాం గెలుపు

image

గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం తన సమీప వైసీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డిపై 9,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచి కౌటింగ్‌ పోటాపోటీగా సాగింది. గుమ్మనూరు జయరాం విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

News June 4, 2024

పెనుకొండలో సవిత భారీ మెజారిటీతో గెలుపు

image

పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌పై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత 33, 629 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News June 4, 2024

ధర్మవరంలో ‘సత్య’మే జయం

image

ధర్మవరం ఎమ్యెల్యేగా సత్యకుమార్ యాదవ్ విజయం సాధించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డిపై సత్యకుమార్ 5000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలినుంచి కేతిరెడ్డి మెజారిటీ సాధించగా.. చివర్లో బీజేపీ పుంజుకుంది. కేతిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత, కూటమినేతల సపోర్ట్, జాతీయనేత కావడం సత్యకు కలిసివచ్చింది. బీసీ ఓటర్లు సహా అన్ని సామాజికవర్గాల ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సత్య సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

News June 4, 2024

ధర్మవరంలో సత్యకుమార్ యాదవ్ ముందంజ

image

ధర్మవరం నియోజకవర్గ 19వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి వై.సత్యకుమార్ యాదవ్ ముందంజలోకి వచ్చారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 3300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒకానొక దశలో 11 వేల ఓట్ల లీడ్లోకి కేతిరెడ్డి వెళ్లగా.. బత్తలపల్లె, ధర్మవరం రూరల్ ప్రజలు బీజేపీవైపు మొగ్గుచూపారు.

News June 4, 2024

పయ్యావుల కేశవ్ గెలుపు

image

ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలిచారు. 15 రౌండ్లకుగాను పయ్యావులకు 1,00,550 ఓట్లు, వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి 79,746 ఓట్లు వచ్చాయి. మొత్తం 21,704 మెజారిటీ వచ్చింది. ఉమ్మడి అనంతలో 12 చోట్ల టీడీపీ విజయం దిశగా దూసుకెళ్లింది. టీడీపీ శ్రేణులు భారీగా సంబరాలు చేసుకుంటున్నాయి. అనంతపురం పట్టణంలోని పయ్యావుల ఇంటి వద్ద ఇప్పటికే సంబరాలు ప్రారంభమయ్యాయి.

News June 4, 2024

ఐదో రౌండ్ పూర్తి.. 10,935 ఓట్లతో ఆధిక్యంలో బాలకృష్ణ

image

హిందూపురం బిట్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఐదో రౌండ్ ముగిసేసరికి హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 10, 935 ఓట్లతో ముందంజలో ఉన్నారు. హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీ.ఎన్. దీపికపైన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ముందంజలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

News June 4, 2024

1880 ఓట్ల అధిక్యంలో నందమూరి బాలకృష్ణ ముందంజ

image

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి టి.ఎన్ దీపికపై 1880 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.